MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం

ABN , First Publish Date - 2023-04-09T23:07:48+05:30 IST

‘ప్రతి గుడిలో మూల విగ్రహాలు ఉంటాయి. అవి బయటికి రావు కాబట్టి.. వాటి విశిష్టతను తెలిపే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని పాటకు ఆస్కార్‌ అనే ప్రతిష్టాత్మక అవార్డ్ రావడానికి ప్రధాన కారణం

MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం
MM Keeravani

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం.. మరోసారి తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కి చేర్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) నటనకు అంతా ఫిదా అయ్యారు. వీరిద్దరి కలిసి డ్యాన్స్ చేసిన ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జాబితాలో ఆస్కార్ అవార్డ్ (Oscar Award) వరించిన విషయం తెలిసిందే. ప్రపంచవేదికపై సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani), పాట రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అవార్డును అందుకుని.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆస్కార్ అవార్డు వేడుక అనంతరం ఇటీవలే ఇండియాకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) గ్రాండ్‌గా సత్కరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను చిరు సన్మానించారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.

Read Also: Simhadri4K: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి 4K’ రీ రిలీజ్ అధికారిక ప్రకటన, వీడియో వచ్చేసింది..

ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ (MM Keeravani Speech).. ‘‘ప్రతి గుడిలో మూల విగ్రహాలు ఉంటాయి. అవి బయటికి రావు కాబట్టి.. వాటి విశిష్టతను తెలిపే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని పాటకు ఆస్కార్‌ అనే ప్రతిష్టాత్మక అవార్డ్ రావడానికి ప్రధాన కారణం రాజమౌళి, ప్రేమ్‌రక్షిత్‌ అని చెబుతాను. వారు మూల విగ్రహాలలాంటివారు. వారి తరుఫున సత్కారాలు, సన్మానాలు, అభినందనులు అందుకోవడానికి ఉత్సవ విగ్రహాలుగా నేనూ, చంద్రబోస్‌ ఉన్నాం. మా వంతు ఎంతో కొంత ఉంది. కానీ ప్రధానమైన కారణం వాళ్లిద్దరిదే అని భావిస్తున్నాను. ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు’ సమయంలోనే అదే మాట చెప్పా. అంత టైమ్ ఉండదు కాబట్టి అప్పుడు ఇంత వివరంగా చెప్పలేదు. ఇక్కడ ఉన్న వారంతా మన కుటుంబ సభ్యులే కాబట్టి.. ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిమిత్తం చిత్ర పరిశ్రమంతా ఒక చోట చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక వంకతో అన్ని క్రాఫ్ట్స్ వాళ్లు ఇలా అప్పుడప్పుడు కలుసుకోవడం అనేది చాలా ఆరోగ్యకరమైన పరిస్థితిగా భావిస్తూ.. అది పదే పదే జరగాలని కోరుకుంటున్నాను. సందర్భం ఏదైనా కావచ్చు.. మనషులు మారవచ్చు. ఇలాంటి పండుగ వాతావరణం మళ్లీ మళ్లీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Keeravani-2.jpg

చెన్నైలోని ప్రసాద్‌ 70 ఎం. ఎం. థియేటర్‌లో నా మొట్టమొదటి పాట రికార్డ్ చేయడం జరిగింది. రమేష్ బాబు‌గారు కట్టించిన థియేటర్ అది. ఆ థియేటర్‌‌లోకి అడుగు పెడితే చాలు.. చాలా గొప్ప అనుభూతి వస్తుంది. కృష్ణంరాజు (Krishnam Raju)గారు, సూర్యనారాయణరాజు (Surya Narayana Raju)గారు కొత్తవాడిని అని చూడకుండా నాకు అక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు. ఆ థియేటర్‌లో సాంగ్స్‌ కంపోజ్‌ చేసిన అనుభూతి రసగుల్లా, గులాబ్ జామ్ వంటి స్వీట్ తిన్నటువంటిదైతే.. ‘ఆస్కార్‌’ అవార్డ్ అందుకోవడం అనేది ఒక చక్కటి టీ తాగిన అనుభూతిని ఇచ్చింది. మాములుగా స్వీట్‌ తిన్న తర్వాత టీ తాగితే.. టీలోని మాధుర్యం తెలియదు. అలాగని దాన్ని కొట్టిపడేయకూడదు.

MM-Keeravani.jpg

కార్తికేయ భార్య నన్ను అంకుల్ అంటుంది. ఆస్కార్ అందుకున్నా కూడా మీరు ఎగ్జైట్‌ అవ్వడం లేదేంటి అని అడిగేది. జీవితంలో అన్నీ చూసిన నాకు ఆస్కార్ అందుకున్నందుకు ఎగ్జైట్‌మెంట్ ఏమీ లేదు.. వచ్చినందుకు సంతోషంగానే ఉన్నాను. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన రాజమౌళి, ప్రేమ్‌రక్షిత్‌, ‘నాటు నాటు’ పాటకు కష్టపడి డ్యాన్స్‌ చేసిన ఇద్దరు హీరోలు.. ఉక్రెయిన్ ఈ పాటకు డ్యాన్స్ చేసిన డ్యాన్సర్లు.. ఇలా ఎన్నో మెట్లు కలిస్తేనే ఈ అవార్డు వచ్చింది. అందరి సమష్టి కృషి లభించిన విజయాన్ని ఇలా సమిష్టిగా మెచ్చుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు..’’ అని కీరవాణి వివరించారు. (MM Keeravani about Oscar Award)

ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-09T23:14:27+05:30 IST