Ala Ninnu Cheri: ఈ సినిమాతో కచ్చితంగా బ్రేక్ వస్తుందంటోన్న సంగీత దర్శకుడు

ABN , First Publish Date - 2023-11-07T20:52:15+05:30 IST

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తనకు తప్పకుండా బ్రేక్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్.

Ala Ninnu Cheri: ఈ సినిమాతో కచ్చితంగా బ్రేక్ వస్తుందంటోన్న సంగీత దర్శకుడు
Ala Ninnu Cheri Movie Still

ఏ సినిమాకైనా పాటలు ఎంతో ప్రధానం. ప్రేమ కథా చిత్రాలకు సంగీతమే ప్రాణం. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘అలా నిన్ను చేరి’ (Ala Ninnu Cheri). విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ (Subhash Anand) సంగీతాన్ని అందించగా.. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ (Chandrabose) పాటలు రాశారు. నవంబర్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ.. (Music Director Subhash Anand Interview)

కర్ణాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇది వరకు నేను చాలా సినిమాలకు సంగీతం అందించాను. కానీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను. ‘అలా నిన్ను చేరి’ సినిమాతో మరింత చేరువవుతానని భావిస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాతకు థాంక్స్. చంద్రబోస్ లాంటి లెజెండరీ వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంటుంది.


Ala Ninnu Cheri Music Director

డైరెక్టర్‌ మంచి కథను రాసుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం నేను ఎదురుచూశాను. అలాంటి కథే ఇది. ఈ మూవీతో నా కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. సాహిత్య విలువలు, మంచి పాటలను అందించాలని నేను కోరుకుంటాను. ఇళయరాజా, దేవీ శ్రీ ప్రసాద్, హారీస్ జయరాజ్ గార్లే నాకు స్పూర్తి. ఇళయరాజా గారి పాటల్లో లిరిక్స్ ఎక్కువగా కనిపిస్తాయి.. వినిపిస్తాయి. అలాంటి సంగీతాన్ని ఇవ్వాలని భావిస్తున్నాను. ఏ జానర్‌లో అయినా సరే మంచి మ్యూజిక్ ఇస్తాను. (Music Director Subhash Anand)

అలా నిన్ను చేరిలోని ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాటను ఒక్కో స్టైల్లో కంపోజ్ చేసే ఛాన్స్ దొరికింది. నవరసాలను చూపించేలా పాటలుంటాయి. సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. జావెద్ అలీ, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహెరా, సింహ, ఇంద్రావతి చౌహాన్ వంటి వారు పాటలను అద్భుతంగా పాడారు. నవంబర్ 10న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను.


ఇవి కూడా చదవండి:

========================

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

*Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

*************************************

Updated Date - 2023-11-07T20:52:16+05:30 IST