Ntr warning: ఇది నా అభిమానులకే కాదు.. అందరి అభిమానులకి
ABN , First Publish Date - 2023-02-06T16:09:34+05:30 IST
సినిమా అప్డేట్ల విషయంలో అభిమానులు పెడుతున్న ఒత్తిడిపై జూ.ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అదిరిపోయే అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు అభిమానులకే చెబుతాం.
సినిమా అప్డేట్ల విషయంలో అభిమానులు పెడుతున్న ఒత్తిడిపై జూ.ఎన్టీఆర్ (Jr ntr Fire) అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అదిరిపోయే అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు అభిమానులకే చెబుతాం. దయచేసి దర్శకనిర్మాతను ఒత్తిడికి గురి చేయవద్దు’’ (Ntr Sweet warn to Fans) అని ఆయన అభిమానులకే కాకుండా అందరి అభిమానులను సున్నితంగా హెచ్చరించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘అమిగోస్’(Amigos) చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే... (jr ntr about movie updates)
‘‘సినిమాలు చేస్తున్న సమయంలో ఒక్కోసారి అప్డేట్ ఇవ్వడానికి ఏమీ ఉండదు. ప్రతి రోజు, ప్రతి పూట, ప్రతి గంటకు సినిమాకు సంబంధించి అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ (అభిమానులు)ఆరాటం, ఉత్సాహం అర్థమవుతోంది. (Ntr sweet waring to fans) ఈ ఆరాటం వల్ల కొన్నిసార్లు దర్శకనిర్మాతలపై ఒత్తిడి పెరుగుతుంది. అభిమానులకు అప్డేట్ ఇవ్వాలని వాళ్లు ఏది పడితే అది చెప్పలేరు. ఒకవేళ అలా చెప్పి.. అది తప్పు అయితే తిట్లు వారికే... ఒత్తిడి వారికే! ఇది నా ఒక్కరికే ఎదురయ్యే సమస్య కాదు.. చాలామంది దర్శక నిర్మాతలకు ఎదురవుతున్న సమస్య. ఏదన్నా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెబుతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ అందరూ మాకు ఎంతో ముఖ్యం కాబట్టి. ఇది నా గురించి మాత్రం చెప్పేది కాదు. ఎంతో మంది నటీనటులు గురించి కూడా. మన తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. ఇప్పుడు తీసే ప్రతి సినిమా చాలా బాధ్యతగా తీయాలి. ఉత్తమ రిజల్ట్ వచ్చేలా చూసుకోవాలి. అదంతా జరగాలంటే మేమంతా ఎంతో కష్టపడాలి. దానికి సమయం పడుతుంది. అదిరిపోయే అప్డేట్ ఉంటే మేమే మీ ముందు ఉంచుతాం. ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని పట్టించుకుని దర్శకనిర్మాతలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఇది నా విన్నపం మాత్రమే. ఎవరినీ నొప్పించాలని కాదు’’ అని తారక్ అన్నారు.
అప్డేట్ ఇవ్వడం కష్టం అంటూనే తారక్ తన తాజా చిత్రం ‘ఎన్టీఆర్30’ గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలో షూటింగ్ మొదలవుతుందని, వచ్చే నెల నుంచి రెగ్యులర్‌గా చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని వెల్లడించారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు.