Jeevitha Rajasekhar: నిర్మాత అరవింద్ పరువునష్టం కేసు, జీవిత రాజశేఖర్ లకు జైలు శిక్ష
ABN , First Publish Date - 2023-07-19T11:38:38+05:30 IST
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011 లో జీవిత రాజశేఖర్ ల మీద వేసిన పరువు నష్టం కేసు నిన్నటికి తుది తీర్పు వచ్చింది. ఈ సంచలన తీర్పు లో ఈ దంపతులకి ఒక ఏడాది పాటు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విధించింది.
పరువు నష్టం కేసులో, ప్రముఖ టాలీవుడ్ దంపతులు జీవిత ఆమె భర్త రాజశేఖర్ (Jeevitha Rajasekhar) లకు నాంపల్లి లోని, 17వ అదనపు చీఫ్ మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ (ఏసిఎంఎం) ఒక ఏడాది జైలు శిక్ష, అయిదు వేల రూపాయలు జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (ChiranjeeviBloodBank) పై గతంలో రాజశేఖర్ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫ్రీ గా రక్తం తెచ్చుకుంటూ, మార్కెట్ లో అమ్ముకుంటున్నారని అప్పట్లో రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద వ్యాఖ్యలు చేశారు.
ఇవన్నీ జరిగింది 2011 సంవత్సరంలో. ఇటువంటి ఆరోపణలు చెయ్యగానే అప్పట్లో వెంటనే ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ (AlluAravind) వెంటనే వీరిద్దరిపై పరువునష్టం దావా వెయ్యటం జరిగింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (ChiranjeeviCharitableTrust) చేస్తున్న మంచి పనుల మీద వీరిద్దరూ చేసిన ఆరోపణలు అవాస్తవమని అప్పట్లో అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేయటం జరిగింది. అప్పటి నుండి ఆ కేసు సాగుతూ నిన్నటికి నాంపల్లి కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. వీరిద్దరికీ ఏడాది పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా విధించటం అని తీరుపై ఇచ్చారు.
ఈ దంపతులు వెంటనే జరిమానా చెల్లించటంతో వీరికి జిల్లా కోర్టులో వెంటనే బెయిల్ మంజూరు అయినట్టుగా తెలిసింది. అలాగే వీరు పై కోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకోవచ్చని కూడా చెప్పింది.