Prabhas: ఫేస్‌బుక్ హ్యాక్.. వైరల్ పోస్ట్!
ABN , First Publish Date - 2023-07-27T22:42:51+05:30 IST
ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో దర్శనమిచ్చింది. ‘మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకయింది’ అంటూ ట్వీట్స్ పెట్టారు.
ప్రభాస్ (Prabhas) ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో దర్శనమిచ్చింది. ‘మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్‌తో (Facebook Hacked) ఉన్న ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకయింది’ అంటూ ట్వీట్స్ పెట్టారు. దీంతో అప్రమత్తమైన టీమ్ సమస్యను పరిష్కరించింది. ఆయన ఖాతాను పునరుద్థరించారు. అభిమానులకు అందుబాటులో ఉండటం కోసం 11 ఏళ్ల క్రితం ప్రభాస్ ఫేస్‌బుక్‌లో అడుగుపెట్టారు. 24 మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం ఆ ఖాతా నుంచి రాజమౌళి ఒక్కరినే అనుసరిస్తున్నారు.. ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను శాన్ డియాగోలో విడుదల చేశారు. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.