Salaar - Prashanth neel: ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు..
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:46 PM
’సలార్’, 'డంకీ’ చిత్రాల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ ఈ ఏడాది చివర్లో భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే!
’సలార్’(Salaar), 'డంకీ’ (Dunki) చిత్రాల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదం గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ ఈ ఏడాది చివర్లో భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే! తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ''సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇద్దరు హీరోల సినిమాల మధ్య పోటీ పెడుతూ కొందరు అభిమానులు గొడవలు సృష్టిస్తుంటారు.. నేను ఇలాంటి వాటిని పట్టించుకోను. ఎంకరేజ్ చేయను. ఈ తరహా పోకడలు చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. నటీనటులు ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోరు. వాళ్లంతా స్నేహభావంతో పని చేసుకుంటూ వెళ్తారు. అందరూ అనుకుంటున్నట్లు ‘సలార్’, ‘డంకీ’ మధ్య నెగెటివ్ వాతావరణం ఉండాలని నేను కోరుకోను. ‘డంకీ’ నిర్మాతలు కూడా అలానే ఆలోచించి ఉంటారు. మేమంతా ఒక్కటే.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలనే మా తపన. రెండింటి మధ్య పోటీ ఉండటానికి ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు కదా? అని అన్నారు.
అలాగే ‘సలార్’ సినిమాకు సరైన ప్రచారం చేయలేదని, ఇంకా బాగా చేసుంటే కలెక్షన్లు బాగావచ్చేవని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘డంకీ’తోపాటు కాకుండా సోలోగా విడుదలైతే ఇలాంటి వార్తలు వచ్చేవి కాదన్నారు. రెండు సినిమాల మధ్య పోటీ పెట్టి ఒకదాన్ని తక్కువగా చూడొద్దని ఆయన కోరారు. త్వరలో సలార్ చిత్రానికి కొనసాగింపుగా రెండో పార్ట్ సిద్దం కానుంది. ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రానున్న దాన్ని స్ర్కిప్ట్ ఇప్పటికే సిద్థమైంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం రెండో భాగం ఇంకా అద్భుతంగా ఉందనుందని చిత్ర బృందం చెబుతోంది.