Adipurush - Manoj Muntashir: నిశితంగా ఆలోచించే మాటలు రాశా!

ABN , First Publish Date - 2023-06-17T16:54:20+05:30 IST

ఆదిపురుష్‌’ చిత్ర బృందంపై శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్‌’ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించినందుకు సినిమా టీమ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Adipurush - Manoj Muntashir: నిశితంగా ఆలోచించే మాటలు రాశా!

'ఆదిపురుష్‌’(Adipurush) చిత్ర బృందంపై శివసేన (UBT) ఎంపీ ప్రియాంకా చతుర్వేది (priyanka chaturvedi) మండిపడ్డారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్‌’ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించినందుకు సినిమా టీమ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు ప్రియాంక. ‘‘సినిమాలో హనుమంతుడి పాత్రకు పేలవమైన సంభాషణలు రాసిన మాటల రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వినోదం పేరుతో మనం పూజించే దేవుళ్లకు ఇలాంటి భాషను వినియోగించడం తప్పు. ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి. మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్‌ విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటేయడం ఆమోదించదగ్గ విషయం కాదు’’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. (Priyanka Demands Apolo

అంతే కాదు ఓ సన్నివేశంలో ఇంద్రజిత్తుతో ఆంజనేయుడు చెప్పే సంభాషణలు చర్చకు దారి తీశాయి. ఆ సంభాషణలను తప్పుబడుతూ నెటిజన్లు సైతం కామెంట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాటల రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ (Manoj Muntashir Sukla) శుక్లా స్పందించారు. ‘‘ఎంతో శ్రద్థ పెట్టి హనుమాన్‌ (Hanuman)సంభాషణలు రాశాను. ఎక్కడా తప్పుగా రాయలేదు. నిశితంగా ఆలోచించాకే డైలాగ్స్‌ రాశాను. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా. పాత్రల మధ్య తేడా చూపించడం కోసం డైలాగ్‌లను సరళీకరించాను’’ అని అన్నారు.

ట్రోలింగ్‌కు గురైన డైలాగ్‌ గురించి కూడా ఆయన స్పందించారు. ఆ తరహా డైలాగ్స్‌ రాసిన మొదటి వ్యక్తిని నేను కాదు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. జానపథ కళాకారులు ‘రామాయణం’ను వివరించేటప్పుడు హనుమంతుడి సంభాషణలు ఇలాగే చెప్పేవారు. వాటినే నేను సినిమాలోకి తీసుకున్నాను’’ అని ఆయన అన్నారు.

ప్రభాస్‌ - కృతిసనన్‌ జంటగా ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మఽధ్య ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ తొలి రోజు రూ. 140 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ చెబుతోంది.

Updated Date - 2023-06-17T16:54:20+05:30 IST