Priyanka Chopra: అప్పుడు నాకు 17.. అతనికి ఏడు!

ABN , First Publish Date - 2023-05-12T11:19:23+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా (Global Star priyanka Chopra) తనకంటే వయసు తక్కువ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే!

Priyanka Chopra: అప్పుడు నాకు 17.. అతనికి ఏడు!

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా (Global Star priyanka Chopra) తనకంటే వయసు తక్కువ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే! నిక్‌ జోనస్‌(Nickjonas)కు, ప్రియాంక చోప్రాకు మధ్య పదేశ వయసు తేడా ఉంది. అతనికంటే ప్రియంకాపదేళ్లు పెద్ద. తాజాగా ఓ వేదికపై ఈ విషయంపై స్పందించారు. తాను మిస్‌ వరల్డ్‌(2000) కిరీటం గెలుపొందినప్పుడు నిక్‌ జోనస్‌కు ఏడేళ్లు ఇలా చెప్పడం కాస్త ఓ వింతలా ఉందని ఆమె అన్నారు. ‘‘నేను పదిహేడేళ్ల వయసులో మిస్‌ వరల్డ్‌గా కిరీటం అందకున్నా. లండన్‌ వేదికగా జరిగిన ఆ పోటీల్లో నేను పాల్గొన్నాను. అప్పుడు 17 ఏళ్లంటే నేను చినన పిల్లనే. అప్పుడు నేను ఏం చేస్తున్నానో, నా గురించి బయటవాళ్లు ఏం అనుకుంటున్నారో కూడా అంతగా తెలియదు. 2000లో జరిగిన ఆ పోటీలను మా మావయ్య- అత్తయ్య టీవీలో చూశారట. నేను టైటిల్‌ గెలుపొందిన క్షణాలను తనకింకా గుర్తేనని అత్తయ్య నాతో చెప్పారు. అయితే అప్పుడు నిక్‌ వయసు 7 ఏళ్లు అంట. ఇంట్లో వాళ్లతోపాటు తను కూడా టీవీ ముందు కూర్చొని నన్ను చూశాడట. తలచుకుంటే వింతగా ఉంది. కాలం మా ఇద్దర్నీ కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉంది. వయసుపరంగా మా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్సాసం ఉన్నప్పటికీ మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. నిక్‌తో బంధం ఏర్పడటానికి ముందు నేను చాలామందితో డేట్‌ చేశాను. నిక్‌కు కూడా రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయి. వాటి గురించి నేను (Dating with many people) పట్టించుకోలేదు. జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించను. భవిష్యత్తు ఏంటనేదానిపై నా దృష్టి ఉంటుంది. ఆ దిశగానే నేను అడుగులు వేస్తా. మా ఇద్దరికీ అదే ఇష్టం’’ అని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం హాలీవుడ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’తో అలరిస్తోందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Untitled-1.jpg

Updated Date - 2023-05-12T11:19:23+05:30 IST