PriyankaChopra: నాకు 'ఆర్ఆర్ఆర్' చూసేంత టైం లేదు అన్న ప్రియాంక చోప్రాని ట్రోల్ చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-05-16T16:06:07+05:30 IST

అప్పుడెప్పుడో 'ఆర్ఆర్ఆర్' సినిమాని తమిళ సినిమా అన్నందుకు అగ్ర నటి ప్రియాంక చోప్రాని బాగా ట్రోల్ చేశారు నెటిజన్స్. మళ్ళీ ఇప్పుడు ఆమెని ట్రోల్ చేస్తున్నారు అదే సినిమా గురించి, కానీ ఈసారి ఆమె ఏమందంటే...

PriyankaChopra: నాకు 'ఆర్ఆర్ఆర్' చూసేంత టైం లేదు అన్న ప్రియాంక చోప్రాని ట్రోల్ చేస్తున్నారు
Priyanka Chopra Jonas

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి, అలాగే ఇప్పుడు హాలీవుడ్ లోనూ హల్చల్ చేస్తున్న ప్రియాంక చోప్రాకి (PriyankaChopra) టైం దొరకటం లేదుట. దేనికి అంటే రాజమౌళి (SSRajamouli) తీసిన 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమా చూడటానికి. ఇందులో రామ్ చరణ్ (RamCharan), ఎన్టీఆర్ (NTR)లు కథానాయకులుగా వేశారు. ఇంతవరకు ఈ సినిమా నేను చూడలేదు, ఎందుకంటే నాకు అస్సలు టైం దొరకటం లేదు ఈ సినిమా చూడటానికి, అని చెప్పింది ప్రియాంక చోప్రా, ఒక సినిమా ప్రొమోషన్ లో భాగంగా. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో 'నాటు నాటు' (Naatu Naatu) పాటకి ఆస్కార్ అవార్డు (OscarAward) వచ్చిన సంగతి తెలిసిందే.

priyankachopra2.jpg

"నేను ఎక్కువ సినిమాలు చూడను, కానీ కొన్ని టీవీ షోస్ మాత్రం తప్పకుండా చూస్తాను," అని చెప్పింది. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' (Citadel) వెబ్ సిరీస్ ఇప్పుడు అమెజాన్ (Amazon) లో స్ట్రీమింగ్ అవుతోంది, అలాగే ఇది టాప్ లో కూడా వుంది. అయితే ఆమె ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం, ట్రోల్ చెయ్యబడటం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆమె 'ఆర్ఆర్ఆర్' #RRR ని తమిళ సినిమా అనింది. ఆ తరువాత ఆ హోస్ట్ తమిళ సినిమా కాదు, బాలీవుడ్ సినిమా అన్నాడు. ఇద్దరిదీ తప్పే. అది తెలుగు సినిమా.

కొన్ని నెలల క్రితం అమెరికాలో ఈ 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కి ప్రియాంక చోప్రా హోస్ట్ చేసింది. అప్పుడు ఆమె దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (MMKeeravani) లతో తను వున్న ఫోటో ట్వీట్ చేసి, ఆ సినిమాకి విషెస్ చెప్పింది. అప్పుడు కూడా ప్రియాంక చోప్రాని బాగా ట్రోల్ చేశారు, ఏ బాష సినిమా తెలియకుండా ఎలా మాట్లాడుతావు అంటూ. మళ్ళీ ఇప్పుడు ఆ సినిమా చూడలేదు అనగానే, మూడు గంటల సమయం నీకు దొరకలేదా, ఆ సినిమా ఇంతవరకు ఎందుకు చూడలేదు అంటూ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

priyankaramcharan.jpg

అలాగే రామ్ చరణ్ ని బ్రాడ్ పిట్ (BradPitt) తో పోలుస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు బాగుంటారు అంటే, బ్రాడ్ పిట్ ఎలాంటి వాడో తనకి తెలియదని కానీ రామ్ చరణ్ మంచి వ్యక్తి అని చెప్పింది ప్రియాంక చోప్రా. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ చాలామంది అభిమానులు వున్నారని, ఇద్దరూ మంచి నటుల్ని చెప్పింది ప్రియాంక.

Updated Date - 2023-05-16T16:06:07+05:30 IST