Rajamouli Tour: టూర్ అదిరింది.. ఉత్తేజం నింపింది
ABN , First Publish Date - 2023-07-11T14:39:03+05:30 IST
‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ హడావిడి కోసం మూడు నెలలపాటు అమెరికాలో గడిపారు రాజమౌళి కుటుంబం. ఆ పులు పూర్తయిన తర్వాత కొన్నాళ్లకు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో తమిళనాడు రాష్ట్రంలో పలు ప్రాంతాలను చుట్టేశారు. విహారం పూర్తయిన తర్వాత ఆయన ఈ ట్రిప్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) ఆస్కార్ హడావిడి కోసం మూడు నెలలపాటు అమెరికాలో గడిపారు రాజమౌళి కుటుంబం. ఆ పులు పూర్తయిన తర్వాత కొన్నాళ్లకు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో తమిళనాడు (Central tamilnadu trip) రాష్ట్రంలో పలు ప్రాంతాలను చుట్టేశారు. విహారం పూర్తయిన తర్వాత ఆయన ఈ ట్రిప్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ట్రిప్‌కు సంబంధించి ఓ వీడియో షేర్ చేశారు. ‘‘సెంట్రల్ తమిళనాడులో రోడ్ ట్రిప్ వేయాలనుకున్నాం. దేవాలయాలను సందర్శించాలనుకునే నా కుమార్తె ఇందుకు కారణం. తన ప్రోద్బలంతో మేము ఈ ట్రిప్ ప్రారంభించాం. జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మదురైకి వెళ్ళాను. ఈ కొద్ది రోజుల్లో మంచుకొండ యొక్క కొనను మాత్రమే తాకవచ్చు. కానీ ఈ తక్కువ సమయంలో చాలా చూశాం. కొత్త అనుభూతిని పొందాం. పాండ్యులు, చోళుల ఇతర పాలకుల హయాంలో కట్టడాలు, అద్భుతమైన వాస్తుశిల్పం, ఇంజనీరింగ్ వర్క్, ఆధ్యాత్మిక ఆలోచనలు మమ్మల్ని నిజంగా మంత్రముగ్థుల్ని చేశాయి.
మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేసినా, రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేసినా అన్ని చోట్లా అద్భుతంగానే ఉంది. ఈ వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం, అక్కడి ఆహారం తర్వాత, ఈ హోమ్ ల్యాండ్ టూర్ ఎంతో ఉత్తేజాన్ని నింపింది’’ అని రాజమౌళి పేర్కొన్నారు.