RajiniKanth: విజయవాడకు రజినీకాంత్‌!

ABN , First Publish Date - 2023-04-23T13:55:21+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ నెల 28న విజయవాడ రానున్నారు. పోరంకిలో జరగనున్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

RajiniKanth: విజయవాడకు రజినీకాంత్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఈ నెల 28న విజయవాడ రానున్నారు. పోరంకిలో జరగనున్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ (Bala krishna) ఓ వీడియో ద్వారా తెలిపారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలు ఛైర్మన్‌ జనార్థన్‌గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి(100YearsOfNTR). విజయవాడతో నాన్నకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన పుట్టిన జిల్లా ఇది. చదువు, నాటకరంగం అంతా ఈ ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత చలచచిత్ర రంగంలో అడుగుపెట్టారు. అందుకే విజయవాడలో అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతోపాటు ఎందరో ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే’’ అని చెప్పారు. ఈ వేడుకను విజయవంతం చేయాలని ఆయన అభిమానులను కోరారు. (100YearsOfNTR)

ఈ ఏడాది ఎన్టీఆర్‌ వందవ జయంతి కావడంతో శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతోపాటు అమెరికాలోనూ ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పలు రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులను ఎన్టీఆర్‌ పేర పురస్కారాలు అందజేస్తున్నారు. (Centenary celebrations of NTR)

Updated Date - 2023-04-23T13:55:21+05:30 IST