Film Celebs Fathers Day: తండ్రితో అనుబంధం గురించి ఏమన్నారంటే ..

ABN , First Publish Date - 2023-06-18T10:55:59+05:30 IST

ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది అమ్మ అయితే.. వేలుపట్టి నడిపిస్తూ లోకాన్ని పరిచయం చేసే సూపర్‌ హీరో మాత్రం ‘నాన్నే’. ప్రతీ ఒక్కరికీ తమ మొదటి హీరో అయినా, రోల్‌ మోడల్‌ అయినా.. తండ్రే. నేడు ‘ఫాదర్స్‌ డే.’ ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు తండ్రితో తమకున్న అనుబంధాన్ని వివిధ సందర్భాల్లో ఇలా గుర్తు చేసుకున్నారు.

Film Celebs Fathers Day:  తండ్రితో అనుబంధం గురించి ఏమన్నారంటే ..

ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది అమ్మ అయితే.. వేలుపట్టి నడిపిస్తూ లోకాన్ని పరిచయం చేసే సూపర్‌ హీరో మాత్రం ‘నాన్నే’(Daddy). ప్రతీ ఒక్కరికీ తమ మొదటి హీరో అయినా, రోల్‌ మోడల్‌ (Father is role model) అయినా.. తండ్రే. నేడు ‘ఫాదర్స్‌ డే.’ ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు తండ్రితో తమకున్న అనుబంధాన్ని వివిధ సందర్భాల్లో ఇలా గుర్తు చేసుకున్నారు. (Happy Fathers day)

45.jpgజీవితాంతం గుర్తుండే క్షణాలు

నాన్నతో నేను గడిపిన మధురమైన క్షణాలు అంటే.. అది ‘ఆచార్య’ షూటింగ్‌ సమయంలోనే. సుమారు 15-18 రోజులు ఇద్దరం కలిసే పనిచేశాం. ఆ సమయంలో పొద్దున ఐదున్నర గంటలకే లేచి ఇద్దరం కలసి వర్కవుట్స్‌ చేసేవాళ్లం, కలిసి భోజనం చేసేవాళ్లం, సాయంత్రం షూటింగ్‌ నుంచి వచ్చిన తర్వాత కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లం, నిద్రపోయేవాళ్లం.. ప్రతీ నిమిషాన్ని ఎంజాయ్‌ చేస్తూ రోజు మొత్తం సరదాగా గడిపేవాళ్లం. ఆ క్షణాలను వర్ణించడానికి నాకు మాటలు కూడా సరిపోవు. (international fathers day)

-రామ్‌చరణ్‌ (Ram charan)

WhatsApp Image 2023-06-18 at 10.11.35 AM (3).jpegఅన్నీ నాన్నతోనే పంచుకుంటా.. (happy fathersday)

చిన్నప్పుడు నాన్న చాలా కఠినంగా ఉండే వారు. కానీ పెరిగేకొద్దీ నాతో ఫ్రెండ్లీగా మారి పోయారు. ఇప్పుడు నేను దేని గురించైనా ఆయనతో చెప్పుకునేంత చనువు ఏర్పడింది. మనం అమ్మానాన్నలతో చెప్పుకోలేని కొన్ని విషయాలను ఫ్రెండ్స్‌తో మాత్రమే షేర్‌ చేసు కుంటాం కదా.. అలా నేను అన్నీ షేర్‌ చేసుకునే ఏకైక వ్యక్తి, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ నాన్నే. ఇప్పటికీ కొన్ని నిర్ణయాలు నాకు నేను సొంతంగా తీసు కోలేను. అలాంటప్పుడు నాన్నకి ఫోన్‌ చేసి సలహాలు అడుగుతుంటా. అప్పుడు నాకెంతో నమ్మకం ఏర్పడుతుంది.

- రాశీఖన్నా(Raasi Khanna)

a.jpg

సినిమాలే ప్రేమను పెంచాయి (World Fathers DAY)

చిన్నప్పుడు నేను నాన్నతో ఎక్కువగా గడిపింది లేదు. ఎప్పుడూ ఆయన సినిమాలు, షూటింగ్‌లు అంటూ బిజీగా ఉండేవారు. ఆయన ఇంటికి వచ్చిన ప్రతీసారీ ఎవరో సెలబ్రిటీ వచ్చినట్లు భావించేదాన్ని. కొన్నాళ్ల తర్వాత ఆయనే మా కోసం కొంత సమయం

కేటాయించడం ప్రారంభించారు. ఆ సమయంలో నేను, నాన్న సరదాగా వైకుంఠపాళీ ఆడుకునే వాళ్లం. ఇండస్ట్రీలోఅడుగుపెట్టాకే నాకు అర్థమైంది ఆయన ఎందుకు మాకు దూరంగా ఉండాల్సి వచ్చిందోనని. సినిమాల మీద మా ఇద్దరికీ ఉన్న ప్రేమే అనుబంధాన్ని మరింత పెంచింది.

- అలియాభట్‌ (Alia bhatt)

Untitled-1.jpg

అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది..

నేను పుట్టడానికి రెండ్రోజుల ముందు.. మా నాన్నకి ఓ కల వచ్చిందట. పెద్ద కళ్లు, పొడవైన జుట్టుతో ఓ పాప తన పొట్ట మీద ఆడుకుంటున్నట్లు. ఆ కల గురించి నాన్న తరచుగా నాకు చెబుతుంటారు. అది విన్నప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంటుంది. చిన్నతనంలో నాన్న ఎప్పుడూ వ్యాపార పనులతో బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు నా ఈ ప్రయాణంలో ఆయనే మెయిన్‌ పిల్లర్‌గా నిలిచారు. మేం పెద్దగా మాట్లాడుకోం కానీ ఒకరి మీద ఒకరికి అంతులేని ప్రేమ ఉంది. నాన్న చూపించే ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది.

-రష్మిక మందన్నా(Rashmika Mandanna)

Updated Date - 2023-06-18T11:15:20+05:30 IST