Ram Gopal Varma: ‘వ్యూహం’ కథేంటి.. సినిమా వెనుక ఎవరెవరున్నారో క్లియర్‌కట్‌గా చెప్పేసిన ఆర్జీవీ
ABN , First Publish Date - 2023-08-13T17:43:16+05:30 IST
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’. అజ్మల్, మాసన కీలక పాత్రధారులుగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం మధ్యాహ్నాం ప్రకాశం బ్యారేజిపై చేశారు. ఈ మేరకు అక్కడ ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. వైయస్ మరణం దగ్గర నుంచి ‘వ్యూహం’ కథ మొదలవుతుందని చెప్పారు.
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Rgv) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’(Vyuham) . అజ్మల్, మాసన కీలక పాత్రధారులుగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం మధ్యాహ్నాం ప్రకాశం బ్యారేజిపై చేశారు. ఈ మేరకు అక్కడ ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. వైయస్ మరణం దగ్గర నుంచి ‘వ్యూహం’ కథ మొదలవుతుందని చెప్పారు. రెండు భాగాలుగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ‘‘వైయస్ మరణం తరువాత పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో ఇందులో చెబుతాం. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంది. ఆ హత్య కేసులో నిందితులను చూపిస్తా. భారతీరెడ్డిని నేను దగ్గరి నుంచి చూశా. జగన్‌తోపాటు భారతి పాత్ర కూడా ఉంటుంది. ఎవరేమి సినిమాలు తీసినా నాకు అనవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి. అందులో ప్రధాన ఘట్టాలు సినిమాలో ఉన్నాయి. నేను జగన్‌కు అభిమానిని. కానీ ఎవరి పైనా నాకు ద్వేషం లేదు. జగన్‌పై నాకున్న అభిప్రాయాన్ని సినిమాగా చెబుతున్నా. నా సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అగిడినా దర్శకత్వం చేయను’’ అని అన్నారు.
అంతేకాదు రెమ్యునరేషన్ గురించి కూడా వర్మ మాట్లాడారు. ‘‘ఇచ్చే వాళ్లు ఉంటే... హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎవరికి ఎంత అనేది మార్కెట్‌ను బట్టి నిర్మాత చూసుకుంటారు’’ అని వర్మ అన్నారు. చిరంజీవి కామెంట్స్‌పై వర్మ స్పందించారు. ‘‘చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో నాకు తెలీదన్నారు