RT4GM: ఆగిన రవితేజ, గోపీచంద్ సినిమా.. నిజమేనా?
ABN , First Publish Date - 2023-11-23T07:30:00+05:30 IST
ఈమధ్య సినీ ఇండస్ట్రీలో బాగా క్రేజ్‌ఉన్న ఈ చిత్రం రవితేజ, గోపిచంద్ కాంబినేషన్‌లో వస్తున్న 4వ సినిమానే. డాన్ సినిమా, బలుపు వంటి హిట్స్ క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తాజాగా ఇటీవల అదే కాంబోలో #RT4GM అనే మరో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈమధ్య సినీ ఇండస్ట్రీలో బాగా క్రేజ్‌ఉన్న ఈ చిత్రం రవితేజ(Raviteja ), గోపిచంద్ (Gopichand Malineni) కాంబినేషన్‌లో వస్తున్న 4వ సినిమానే. డాన్ సినిమా, బలుపు వంటి హిట్స్ క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తాజాగా ఇటీవల అదే కాంబోలో #RT4GM అనే మరో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మైత్రీమూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ప్రియాంకమోహన్ కథానాయికగా ఎంపికైంది. తమన్ సంగీతం అందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా రచన చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తవగా గురువారం (నవంబర్ 23) నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాపై సామాజిక మాధ్యమాల్లో కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ కొత్త చిత్రం బడ్జెట్ ఎక్కువ కావడం తదితర సమస్యలతో ఈ సినిమాను మధ్యలో ఆపివేయడం జరిగిందని, ఈమధ్య వచ్చిన రవితేజ సినిమాలు ఆశించినంత విజయం సాధించక పోవడంతో నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి చర్చలు చేస్తున్నారని ఆ తర్వాతే తిరిగి షూటింగ్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు అన్నీ ఫేక్ అనీ ఎవరో కావాలని రూమర్స్ పుట్టిస్తున్నరని, సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదని స్క్రిప్ట్ విషయంలో కొద్దిగా ఆలస్యం జరిగిందని రెగ్యులర్ సమయానికే సినిమా షూటింగ్ మొదలవుతుందని గతంలో క్రాక్ వంటి హిట్ చిత్రాన్ని మించేలా ఈ చిత్రం రూపొందుతుందని పాత రికార్డులు అన్నీ తిరిగి రాయడం ఖాయమంటూ మరికొంతమంది వార్తలు షేర్ చేస్తున్నారు. అయితే ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియాల్సి ఉంది.
ఐతే రవితేజ తాజా చిత్రంఈగల్ సినిమా విషయంలోనూ ఇలానే పుకార్లు సృష్టించారు. 2024 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాను వాయిదా వేశారంటూ తప్పుడు వార్తలను వైరల్ చేశారు. దీంతో మేకర్స్ స్వయంగా రంగంలోకి దిగి అలాంటిదేమి లేదని అనుకున్న సమయానికే పొంగల్‌కే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ నెట్ వినియోగం పెరిగాక చేతిలోకి ప్రపంచం వచ్చి చేరాక నిత్యం ఏదో అంశానికి ఉన్నది, లేనిది ఆపాదిస్తూ చాలామంది తమ టాలాంటెను చూయిస్తూ నెటిజన్లపై తమ ప్రతాపం చూయిస్తున్నారు.