Sudheer varma: ఆత్మహత్యకు కారణమదే!

ABN , First Publish Date - 2023-01-24T15:52:56+05:30 IST

టాలీవుడ్‌ హీరో సుధీర్‌వర్మ ఆత్మహత్యతో ఇండస్ర్టీలో విషాదం చోటు చేసుకుంది. ‘కుందనపు బొమ్మ, ‘సెకండ్‌ హ్యండ్‌’ సినిమాలు , ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ వంటి వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌ ఆత్మహత్యకు కారణాలేంటన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Sudheer varma: ఆత్మహత్యకు కారణమదే!

టాలీవుడ్‌ హీరో సుధీర్‌వర్మ ఆత్మహత్యతో ఇండస్ర్టీలో విషాదం చోటు చేసుకుంది. ‘కుందనపు బొమ్మ, ‘సెకండ్‌ హ్యండ్‌’ సినిమాలు , ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ వంటి వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌ ఆత్మహత్యకు కారణాలేంటన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నెల 18న సుధీర్‌ వర్మ పాయిజన్‌ తీసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గుర్తించిన స్నేహితుడు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను వైజాగ్‌లోని ఎల్‌. జీ. ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. చికిత్స జరుగుతుండగానే పరిస్థితి విషమించడంతో సుధీర్‌ మరణించారు. పోస్టుమార్టం రిపోర్డుల ప్రకారం విషం తీసుకోవడం వల్ల మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ విషయంపై అతని స్నేహితుడు మాట్లాడుతూ.. సుధీర్‌ చాలా మంచి వ్యక్తి. సున్నిత మనస్కుడు. అయితే తండ్రి మరణం తర్వాత తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. కొన్నాళ్లుగా ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు’’ అని పేర్కొన్నారు. ఆ కారణంగానే సుధీర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు ేస్నహితులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-24T17:30:55+05:30 IST