Renu Desai: వరుణ్‌తేజ్ పెళ్లికి రేణుదేశాయ్ వెళ్లడం లేదు.. ఎందుకంటే!
ABN , First Publish Date - 2023-10-30T16:47:42+05:30 IST
లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్1న ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ ఇప్పటికే అక్కడికి తరళివెళ్లగా మిగతా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే అక్కడికి ప్రయాణం అయ్యారు. అయితే ఈ వేడుకకు రేణు దేశాయ్ గానీ, పిల్లలు గానీ వెళుతున్నారా లేదా అంటూ సందేహలు వ్యక్తం అవుతున్నాయి.
లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(lavanya)ల వివాహం నవంబర్1న ఇటలీ(Italy)లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ ఇప్పటికే అక్కడికి తరళివెళ్లగా మిగతా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే అక్కడికి ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్, రామ్ చరణ్(Ram Charan)లు వారి వారి ఫ్యామిలీలతో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవడంతో సినీ అభిమానులు ఆసక్తిగా తిలకించారు.
అయితే ఆ వీడియోల్లో ఎక్కడా రేణు దేశాయ్ గానీ, పిల్లలు గానీ కనిపించక పోవడంతో అసలు వారు పెళ్లికి వెళుతున్నారా లేదా అంటూ సందేహలు వ్యక్తం అవుతున్నాయి. వారికి సంబధించిన ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని గూగుల్, ఎక్స్‌లలో తెగ వెతికేస్తున్నారు. గతంలో మెగా ఇంట జరిగిన వేడుకలన్నింటికీ రేణుదేశాయ్ వెళ్లకపోయినా పిల్లలు అఖిరానందన్, ఆధ్యలు పవన్‌తో కలిసి వెళ్లేవారు. రాజస్థాన్‌లో జరిగిన నిహారిక పెళ్లికి కూడా పిల్లలిద్దరూ హజరయ్యారు. అయితే ఇటలీలో జరగబోతున్న వరుణ్ తేజ్ పెళ్లికి రేణుదేశాయ్, పిల్లలు అఖిరానందన్, ఆధ్యలు హజరు కావడం లేదన్నట్లుగా తెలుస్తుంది.
ఇటీవల రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇన్విటేషన్ వచ్చింది గానీ వరుణ్, లావణ్యల పెళ్లికి వెళ్లడం లేదని వారికి నా అశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపింది. గతంలోనూ నిహరిక పెళ్లికి వెళ్లలేదని, ఆ ఇంట జరిగిన ఏ వేడుకల్లో కూడా పాల్గొన లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ నేను వెళితే నేను, ఆక్కడున్న వారు అన్ కంఫటబుల్‌గా ఫీలయ్యే అవకాశం ఉంటుందని దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గతంలో మెగా ఇంట్లో అన్ని వేడులకు హజరవుతూ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్న అఖిరా, ఆధ్యలు ఈ సారి వరుణ్ పెళ్లి వేడుకలకు వెళ్లడం లేదని తెలుస్తోంది
ఇప్పటికే పవన్ కల్యాణ్ తన భార్య లెజనోవా(Anna lezhneva)తో కలిసి ఇటలీకి వెళ్లిపోయారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి కూడా. కానీ పిల్లలు ప్రస్తుతం తల్లి దగ్గరే ముంబయ్‌లో ఉన్నట్లు రేణుదేశాయ్ ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియో ద్వారా స్పష్టం అవుతుంది. ఇక పెళ్లికి ఒకరోజే సమయం ఉండడంతో పిల్లలు ఇటలీకి వెళ్లడం లేదన్నట్లుగా అర్థం అవుతున్నది.