Oscar for RRR: అడుగు దూరంలో కాదు.. అరచేతిలోనే..!

ABN , First Publish Date - 2023-03-07T20:08:52+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సినీలోకం ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ పురస్కారం దక్కించుకోవాలని ప్రతి సినీ మేకర్‌ ఆరాటపడతారు.. ఆశిస్తారు. 94 ఏళ్ల చరిత్ర ఆస్కార్‌ది.

Oscar for RRR: అడుగు దూరంలో కాదు.. అరచేతిలోనే..!

ప్రపంచవ్యాప్తంగా సినీలోకం ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (Oscar 2023) పురస్కారం దక్కించుకోవాలని ప్రతి సినీ మేకర్‌ ఆరాటపడతారు.. ఆశిస్తారు. 94 ఏళ్ల చరిత్ర ఆస్కార్‌ది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను వరించి మరిన్ని మంచి చిత్రాలు వచ్చేలా ఆయా మేకర్‌లను ప్రోత్సహించింది. 95వ ఆస్కార్‌ వేడుక ఈ నెల 12న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌కు వివిధ భాషల్లో దాదాపు 300 సినిమాలు నామినేషన్స్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. వాటిలో కొన్ని ఉత్తమ చిత్రాల కేటగిరీలో అవార్డుల బరిలో నిలిచాయి. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (natu natu) ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగీరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. భారత ప్రభుత్వం అధికారికంగా గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను నామినేషన్‌కు పంపినా ఫైనల్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకోలేకపోయింది.

2.jpg

రాజమౌళి (Raja mouli) దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ‘ఆస్కార్‌’ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడం పట్ల యావత్‌ భారత చలన చిత్ర పరిశ్రమ గర్విస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఆస్కార్‌ వరించాలని కోరుకుంటున్నారు. కొందరు విశ్లేషకులు అయితే ‘ఆస్కార్‌కు అడుగు దూరంలో కాదు.. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) అరచేతిలోనే ఆస్కార్‌ ఉంది’ అని చెబుతున్నారు. అందుకు పలు కారణాలు, ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం అంతర్జాతీయ వేదికలపై ‘గోల్డెన్‌ గ్లోబ్‌ (RRR -Golden globe), హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్‌(Hollywood Crictics associations), క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌’ ఇలా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇవన్నీ ఆస్కార్‌ అందుకోవడానికి ముందు జరిగే ప్రక్రియలు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 2009లో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రం ఆస్కార్‌కు ఎంపికైనప్పుడు ఇదే ప్రాసెస్‌ జరిగిందని ఉదాహరణలిచ్చారు. పైగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అంతా తరచూ అమెరికా పర్యాటనలో ఉండటం, ప్రమోషన్‌ యాక్టివిటీస్‌ని వేగవంతం చేయడం కూడా అందులో భాగమే అని చెబుతున్నారు. దాదాపు 20 రోజులుగా రాజమౌళి అండ్‌ కో అమెరికాలోనే ఉన్నారు. అక్కడ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ ముచ్చట్లను వివరిస్తున్నారు. పటు చోట్ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం పదర్శనలు చేశారు. అభిమానుల సమక్షంలో సందడి చేస్తున్నారు. దాంతోపాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఎంపికైనా ‘నాటు నాటు’ పాటను ‘ఆస్కార్‌’ వేదికపై లైవ్‌ పెర్‌ఫామ్‌ చేయాలని ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి అకాడమీ నుంచి ఆహ్వానం రావడంతో మరింత ఉత్సాహంగా అమెరికా టూర్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న జరగబోయే ఆస్కార్‌ వేడుకలో ఆ పాటను పాడిన సింగర్స్‌ కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌ పెర్‌పార్మెన్స్‌ చేయనున్నారు. ఆస్కార్‌ వేదికపై ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే టీమ్‌ని ఆహ్వానించడం, లైవ్‌ షో ఏర్పాటు చేయమనడం జరిగిందని చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న విశ్లేషకులు ‘ఆస్కార్‌’ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’దే .. అడుగు దూరంలో కాదు అరతచేతిలోనే ఆస్కారర్‌ ఉంది’ అని నొక్కి మరీ చెబుతున్నారు.

1.jpg

ఎన్నో ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడం, అందులోనూ అది తెలుగు సినిమా కావడంతో తెలుగు సినీ ప్రేక్షకులు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి తప్పకుండా ఆస్కార్‌ రావాలని, ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటాలని కోరుకుంటున్నారు.

Updated Date - 2023-03-08T13:30:49+05:30 IST