HBD Sai Dharam Tej : రాళ్లు వేసినా పూలుగా మార్చుకున్నాడు.. సుప్రీమ్‌గా నిలబడ్డాడు!
ABN , First Publish Date - 2023-10-15T13:03:30+05:30 IST
మెగాస్టార్ మేనల్లుడిగా ఇండసీ్ట్రలో అడుగుపెట్టారు సాయిధరమ్ తేజ్. చిన్నప్పటి నుంచి మావయ్యలు చిరంజీవి నాగబాబు, పవనకల్యాణ్‌లను నటులుగా తెరపై చూసి స్ఫూర్తి పొందిన ఆయన నటనా రంగంపై ఆసక్తి చూపించి మావయ్యల సపోర్ట్‌తో హీరోగా పరిచయమయ్యారు. మెగా కాంపౌండ్ అనే బ్యాగ్రౌండ్ ఉన్నా కష్టం, వినయ విధేయతలు, డెడికేషనని నమ్ముకుని చక్కని అవకాశాలు అందుకుంటున్నారు.
మెగాస్టార్ మేనల్లుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). చిన్నప్పటి నుంచి మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ (Pawan kalyan)లను నటులుగా తెరపై చూసి స్ఫూర్తి పొందిన ఆయన నటనా రంగంపై ఆసక్తి చూపించి మావయ్యల సపోర్ట్‌తో హీరోగా పరిచయమయ్యారు. మెగా కాంపౌండ్ అనే బ్యాగ్రౌండ్ ఉన్నా కష్టం, వినయ విధేయతలు, డెడికేషన్ని నమ్ముకుని చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. విభిన్నమైన జానర్ కథలను ఎంచుకుంటూ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే సుప్రీమ్ హీరో (Supreme Hero) అనే ట్యాగ్ తెచ్చుకున్నారు. ఆదివారం సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం..
తేజ్‌ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను దర్శక నిర్మాత వై.వి.ఎస్ చౌదరి తీసుకున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా "రేయ్’ చిత్రాన్ని ప్రారంభించారు. ఎంతో ఘనంగా మొదలైన ఈ చిత్రం ఆర్థిక సమస్యల వల్ల అనుకున్న సమయంలో విడుదలకు నోచుకోలేకపోయింది. దాంతో తొలి చిత్రంగా ుపిల్ల నువ్వు లేని జీవితం’ సినిమా విడుదలైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో తేజ్ మార్కెట్ పెరిగింది. అదే తరుణంలో రెండో చిత్రంగా వైవిఎస్ చౌదరి "రేయ్’ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల ఆలస్యం కావడం, కథ అవుట్ డేట్ అయిందనే భావనతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని అంతగా ఆదరించలేదు. తదుపరి మూడో చిత్రంగా 'సుబ్రమణ్యం ఫర్' సేల్ చిత్రంలో నటించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. తదుపరి సుప్రీమ్ చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో సాయితేజ్‌కు సుప్రీమ్ హీరో ట్యాగ్ వచ్చింది. ఈ నాలుగు చిత్రాల వరకూ తేజ్ కెరీర్ సాఫీగా సాగింది. తిక్క సినిమాతో ఫ్లాపుల పరంపర మొదలైంది. డిఫరెంట్ జానర్ కథల్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్న తేజ్‌కు తర్వాతి చిత్రాలు తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ.. ఒక్కసారిగా అతన్ని కింద పడేశాయి. 2016 ద్వితీయార్థం నుంచి 2019 ప్రథమార్ధం వరకూ తేజ్‌ని ఫ్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో వచ్చింది 'చిత్రలహరి'. 2019 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం తేజ్‌కి హీరోగా కాస్త ఊతానిచ్చింది. ఆ తర్వాత వచ్చిన' ప్రతి రోజు పండగే', 'సోలో బ్రతుకే సో బెటర్', 'రిపబ్లిక్', తాజాగా విరూపాక్ష, బ్రో చిత్రాలు మళ్లీ విజయబాటలోకి తీసుకెళ్లాయి. (happy birthday Sai tej)
పెయిల్యూర్ నేర్పిన గుణపాఠం...
వరుస పరాజయాలు పలకరించినా తేజ్‌లో సహనం తగ్గలేదు. ఫ్లాపులతో ఎంత కిందకి పడ్డాతో అంతే వేగంగా ువిరూపాక్షతో మళ్లీ లేచాడు. ుబో’తో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఎంచుకునే ప్రతి కథ విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నాడు తేజ్. దీని గురించి ఓ సందర్భంలో ఆయన ఏమన్నారంటే ుూ‘నేను కొన్ని చిత్రాలు చేస్తున్నప్పుడు, అవి వైఫల్యాలను చవి చూస్తాయనే భావన కలిగినా కూడా ఆ చిత్రాల్లో నటించాను. కానీ, ఇప్పుడు నేను చాలా కఠినంగా ఉంటూ సరైన విధానంలో ప్రాజెక్ట్‌లు ఎంపిక చేసుకుంటున్నాను. అలాగే ఏదైన కథ నచ్చలేదంటే ‘నో’ చెప్పడం నేర్చుకున్నాను. ఏదైన ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నప్పుడు స్నేహ బంధం అడ్డు రాకూడదు అనేది నేను నమ్ముతాను. కథ నచ్చకపోతే ‘నో’ చెప్పడం చాలా ముఖ్యం. అదే నా వైఫల్యాల నుంచి నేను నేర్చుకున్న విషయం. అంతేకాకుండా ఎంతో పేరున్న దర్శకుడు కథను చెప్పినా, నాకు నచ్చలేదంటే మర్యాదపూర్వకంగా ‘నో’ చెప్పేస్తా’ అని అన్నారు. ఇక తన కోరికల్లో ముఖ్యమైనది పవనతో స్ర్కీన షేర్ చేసుకోవడం. అది ఈ ఏడాది బ్రోతో కుదిరింది. తను గురువుగా భావించే పవనకల్యాణ్‌తో ుబ్రో’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు తేజ్. అందులో మార్క్ పాత్రతో అలరించాడు.
సేవాగుణం ఎక్కువే...
తన మేనమామల ముగ్గురిలాగే తేజ్‌కి కూడా సేవా గుణం ఎక్కువే. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే చేతనైన సాయం చేసి అండగా నిలుస్తాడు. వృద్ధాశ్రమం నిర్మాణం కోసం అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో ఎవరో చేసిన పోస్ట్ చూసి వెంటనే స్పందించారు తేజ్. ఆ వివరాలు తెలుసుకుని కష్టాల్లో ఉన్న వృద్ధుల కోసం విజయవాడలో ఓ బిల్డింగ్ కట్టింటి మాట నిలబెట్టుకున్నాడు. అంతే కాదు.. 2018 జనవరి 31న ఆంధ్రజ్యోతి పేపర్ సిటీ ఎడిషనలో సూర్యాపేట జిల్లాకు చెందిన దివ్యాంగుడు రంగుల నరేష్ యాదవ్‌కు సంబంధించి ప్రచురించిన ఓ వార్తను చదివిన తేజ్ వెంటనే స్పందించారు. అంతర్జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా.. అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడన్నది ఆ కథనం సారాంశం. అప్పుడు తేజ్ జెంటిల్‌మెన చిత్రం చేస్తున్నారు. నరేశ యాదవ్ గురించి చదివిన తేజ్ ఆ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ వివరాలు, అతని నుంచి నరేశ యాదవ్ వివరాలు తెలుసుకుని సాయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడి గెలవాలన్న అతని తపనను తేజ్ నిజం చేశారు. తన ఆఫీస్‌కు పిలిపించి నరేశ్ యాదవ్‌కు లక్ష రూపాయిల చెక్కును స్వయంగా అందజేశారు. వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించాలని కోరుతూ నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అతను గెలిచి పతకంతో వచ్చి తేజ్‌ని కలిశాడు. మరోసారి ఇబ్బందుల్లో ఉన్న పావలా శ్యామల కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇలా తేజ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
ఆ విషయం అప్పుడే అర్థమైంది...
2021 ఆగస్ట్ పదో తేదిన తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో కొద్ది నెలలపాటు ఆల్మోస్ట్ కోమాలో ఉన్నంత పని జరిగింది. దాదాపు ఆయన కోలుకోవడానికి ఆరు నెలలపైనే సమయం పట్టింది. కోలుకున్న ఏడాదికి ఆయన ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి వచ్చారు. తదుపరి నటించిన విరూపాక్ష, బ్రో చిత్రాల కోసం తేజ్ చాలా కష్టపడ్డారు. ఆరోగ్యంగా తయారైన తర్వాత ఆయన ఓ వేదికపై మాట్లాడుతూ "ఇలాంటి వేడుకలకు వచ్చి స్టేజి పై మళ్లీ మాట్లాడతానని అనుకోలేదు. అందరి ప్రార్థనల వల్ల మళ్లీ తిరిగి వచ్చా. నా చిత్రం ‘రిపబ్లిక్’ షూటింగ్ పూర్తై, విడుదలవుతుందనేలోపు నాకు ప్రమాదం జరిగీగింది. ఆస్పత్రిలో బెడ్‌పై ఉంటే వైష్ణవ్ వచ్చి ‘అన్నా..’ అని పిలిస్తే నేను పలకలేకపోయా. ఆ పరిణామం తర్వాత కుటుంబ సభ్యులు కలిసుంటే ఎంత బాగుంటుందో, ఎంత ధైర్యంగా ఉండగలమో నాకు అర్థమైంది’’ అని తెలిపారు.
అదే అతని బలం..
నటనతోపాటు తేజ్ ఉన్న బలం డాన్స.. చిరంజీవిలాగే తేజ్ కూడా డాన్స బాగా చేస్తాడు. బెస్ట్ అవుట్‌పుట్ కోసం కష్టపడతాడు. కొన్ని సందర్భాల్లో మావయ్య చిరంజీవి, పవనకల్యాణ్‌లను ఇమిటేట్ చేస్తున్నాడని విమర్శించినా అందులో పాజిటివ్ యాంగిల్‌ని మాత్రమే తీసుకుని తన నటనలో మార్పు తీసుకొచ్చాడు. తనని తాను మలచుకున్నాడు. అలాగే ఓ వేడక నిమిత్తం ఓ మాల్‌కి వెళ్లినప్పుడు అక్కడో వ్యక్తి ుమెగా ఫ్యామిలీ నుంచి ఇంకెంత మందిని మాపై రుద్దుతారు అంటూ విసిరిన విమర్శల రాళ్లను కూడా పూలుగా మార్చుకుని టాలీవుడ్‌లో సుప్రీమ్ హీరోగా నిలిచారు తేజ్.
అదొక స్వీట్ మెమరీ
చాలామంది యాక్సిడెంట్ ప్రభావం తన సినిమాలపై పడుతుందని భావించారు. కానీ తేజ్ ఆ ప్రమాదం తాలూక జ్ఞాపకాలను మనసులోనుంచి తీసేశారు. అదొక స్వీట్ మెమరీలాగా పెట్టుకున్నారు. ఇప్పుడు తేజ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సంపత నంది దర్శకత్వంలో ుగాంజా శంకర్’ చిత్రం చేస్తున్నారు. ఇది తేజ్ కెరీర్‌లోనే పక్కా మాస్ చిత్రం కానుంది. సాయిధరమ్ తేజ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే తేజ్!!