Salaar: తెలుగులో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారా?
ABN , First Publish Date - 2023-08-18T13:36:21+05:30 IST
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదలట కానున్న ఈ చిత్రం గురించి మేకర్స్ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ (Salaar) చిత్రం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదలట కానున్న ఈ చిత్రం గురించి మేకర్స్ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మెట్లో (Imax Formate) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘సలార్’ అమెరికన్ డిస్ర్టిబ్యూటర్స్ ట్వీట్ చేశారు. ఐమాక్స్ వెర్షన్ టికెట్ బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇండియాలో ఈ వెర్షన్ అందుబాటులో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడా కూడా ఐమాక్స్ వెర్షన్లో రిలీజ్ చేేస్త మూవీ క్వాలిటీ, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుందని ఇండస్ర్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ను ఈ వెర్షన్లో విడుదల చేద్దామని మేకర్స్ భావించారు. కానీ, సాంకేతిక సమస్యల వల్ల అది కుదరలేదు. ఇప్పటికే తెలుగులో ‘బాహుబలి’ చిత్రం ఐమాక్స్ వెర్షన్లో విడుదలైంది. ‘సలార్’ విడుదలైతే తెలుగులో రెండో ఐమాక్స్ చిత్రంగా సలార్ నిలుస్తుంది.
‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో సూపర్‌హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు దానికి రెట్టింపు రేంజ్లో ‘సలార్’ను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. పక్కా కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. త్వరలోనే ‘సలార్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.