Shiv Raj Kumar: పునీత్ ని చూడగానే ఏడుపు, బాలయ్య సముదాయింపు
ABN , First Publish Date - 2023-02-08T14:35:23+05:30 IST
మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు, దానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishana)) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ రాజ్ కుమార్ తన తమ్ముడు, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) వీడియో చూసి చాల భావోద్వేగానికి గురి అయ్యారు.
కన్నడ కంఠీరవ అని పిలుచుకునే లెజెండరీ నటుడు రాజకుమార్ (Kannada Raj Kumar) తనయుడు శివరాజ్ కుమార్ (Shiv Taj Kumar) నిర్మాత గా మారి 'వేద' (Vedha) అనే కన్నడ సినిమా నిర్మించాడు. గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయి గొప్ప విజయం సాధించింది. హర్ష దర్శకుడు ఈ చిత్రానికి. ఇందులో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం ఈ 'వేద' చిత్రాన్ని ఈనెల 9వ తేదీన 'శివ వేద' (Shiva Vedha) అనే పేరుతో విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు, దానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishana)) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ రాజ్ కుమార్ తన తమ్ముడు, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) వీడియో చూసి చాల భావోద్వేగానికి గురి అయ్యారు.
ఈ సినిమా ఫంక్షన్ లో ముందుగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ మీద ఒక చిన్న వీడియో వేశారు. ఆ వీడియోలో వున్న తమ్ముడిని చూసి, అన్న శివన్న (Shivanna) తన భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు. పక్కనే వున్న బాలకృష్ణ శివన్న ని సముదాయించారు, కానీ తమ్ముడి జ్ఞాపకాలని తలుచుకుంటూ శివన్న బాగా ఏడ్చేశారు. ఆ తరువాత అదే ఫంక్షన్ లో శివన్న అలా భావోద్వేగానికి గురిఅయినందుకు సారీ చెప్పారు. ఏడ్వకూడదని అనుకుంటాను గానీ బేబీ (పునీత్) ఫొటో చూడగానే కంట్రోల్ చేసుకోలేకపోయానను. నాకు 13 ఏళ్లు ఉన్నపుడు పునీత్ పుట్టాడు, తను ఎప్పుడూ నాకు ఒక పిల్లాడు లాంటివాడు. కానీ తాను నా కళ్ల ముందే వెళ్లిపోయాడు. ముందు వెళ్ళిపోయినా తను ఎప్పుడూ అందరి గుండెల్లో జీవించే ఉంటాడు అని చెప్పాడు శివన్న. శివ రాజ్ కుమార్ భార్య గీత ఈ చిత్రానికి నిర్మాత.