Shivaji Family : చిరంజీవి, నాగార్జునే కారణమంటూ భావోద్వేగంతో..
ABN , First Publish Date - 2023-11-13T11:41:02+05:30 IST
ఆదివారం దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు వేదికపై సందడి చేశారు. హౌస్‌లో ఉన్న వాళ్లతో సరదాగా మాట్లాడారు. ఇంటి సభ్యులు పట్ల తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. టాప్ 5లో ఎవరెవరు ఉంటారో తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ సతీమణి శ్వేత, ఆయన రెండో కుమారుడు రిక్కీ వేదికపై మాట్లాడారు.
ఆదివారం దీపావళి (Biggboss7) సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు వేదికపై సందడి చేశారు. హౌస్‌లో ఉన్న వాళ్లతో సరదాగా మాట్లాడారు. ఇంటి సభ్యులు పట్ల తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. టాప్ 5లో (top 5 Contestents) ఎవరెవరు ఉంటారో తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ సతీమణి శ్వేత*Swetha), ఆయన రెండో కుమారుడు రిక్కీ వేదికపై మాట్లాడారు. తమ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి చిరంజీవి, నాగార్జునలే కారణం చెప్పారు. ఈ సందర్భంగా శివాజీ ఆట ఎలా ఉందని నాగ్ (nagarjuna) అడగగా ‘ఇంత బాగా ఆడతాడని ఏ మాత్రం ఊహించలేదు. ఫోన్లో కూడా మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు’ అని శ్వేత చెప్పారు. ‘మేము ఇలా ఉన్నామంటే నాగార్జున, చిరంజీవిగారే కారణం. అది ఇంకా గుర్తుంది..’ అంటూ శ్వేత భావోద్వేగానికి గురవుతుండగా ‘అమ్మా.. నేనొక మాట చెబుతా.. నేను, చిరంజీవిగారు (chiranjeevi) కాదు.. మీ ఆయన టాలెంట్’ అంటూ నాగార్జున అన్నారు.
‘‘మొదటిసారి నా ఫ్యామిలీ ప్రపంచానికి పరిచయం అయింది. నాభార్య పెద్దగా ఎవరికీ తెలీదు. అది కూడా అన్నపూర్ణ స్టూడియో వేదికగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. నాగార్జునగారు మీ గురించి వీళ్లెవరికీ తెలియదండీ. మీరు ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లకు నేను వచ్చాను. మీరెంత మందిని సపోర్ట్ చేసి, ఇండస్ట్రీకి పరిచయం చేశారో నా కళ్లతో చూశా. కుటుంబ నేపథ్యం ఉండొచ్చు కానీ, మంచితనం ఉండటం చాలా అరుదు. మీరు పెట్టిన భిక్ష ఇది. ఎంతమందికి అన్నం పెట్టారో. మాలాంటి వాళ్లందరూ మీకు రుణపడి ఉన్నారు’’ అని శివాజీ అన్నారు.
గెలుచుకుని రా..
నాన్న.. నువ్వు ప్రేక్షకుల మనసు గెలుచుకుందామని హౌస్‌లోకి వెళ్లావు. అది జరిగింది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఆవేశ పడకు. నీ పాయింట్‌పై నిలబడు. నీ వెనుక జనం నిలబడతారు. మిమ్మల్ని అత్యున్నత శిఖరాల్లో చూడాలనుకుంటున్నా. నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలియదు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక శివన్న ఉన్నాడు. అందరినీ గెలుచుకుని రా’ అని శివాజీ కొడుకు రిక్కీ అన్నాడు. ఇక టాప్-5 కంటెస్టెంట్స్‌గా శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్దీప్, ప్రియాంకలు ఉంటారని శివాజీ ఫ్యామిలీ చెప్పారు