Shivatmika Rajasekhar: జీవిత రాజశేఖర్ కూతురిని చూసారా !
ABN , First Publish Date - 2023-03-24T17:18:22+05:30 IST
జీవిత రాజశేఖర్ ల రెండో కూతురు శివాత్మిక తన నటనతో అందరిని మెప్పిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంటోంది. అలాగే సాంఘీక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన ఫోటోస్ ని, సినిమా విశేషాలను పంచుకుంటూ ఉంటుంది.
రాజశేఖర్ అతని భార్య జీవిత (Jeevitha Rajasekhar) ఇద్దరూ నటులే, తరువాత జీవిత దర్శకత్వం, నిర్మాతగా కూడా మారింది. వీరిద్దరే కాకుండా, వీరి కూతుళ్లు ఇద్దరూ కూడా తల్లిదండ్రుల నటనను వారసత్వంగా పుచ్చుకున్నారు. ఇద్దరూ ఇటు తెలుగు, అటు తమిళం లో కూడా చేస్తున్నారు.
ఆ ఇద్దరిలో శివాత్మిక రాజశేఖర్ (Shivatmika Rajasekhar) తన మొదటి సినిమా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) పక్కన 'దొరసాని' (Dorasani) అనే సినిమాతో ఆరంగేట్రం చేసింది. ఆనంద్ కి కూడా ఇదే మొదటి సినిమా కావటం విశేషం. తన మొదటి సినిమాతోనే శివాత్మిక మంచి నటి అని నిరూపించుకుంది. ముఖ్యంగా తన కళ్ళతో మంచి భావాలు పలికించగలదు అని ఆ సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది.
ఆ 'దొరసాని' సినిమాలో దేవకీ పాత్రకి గాను శివాత్మిక అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ తరువాత తమిళ్ సినిమాలో కూడా 'ఆనందం విలయడం వీడు' (Anandham Vilayadum Veedu) అనే సినిమాతో ఆరంగేంట్రం చేసింది. ఇందులో గౌతమ్ కార్తిక్ కథానాయకుడు.
ఆమధ్య 'పంచతంత్రం' (Panchatantram) అనే సినిమాలో లేఖ అనే పాత్ర చేసింది. ఇందులో అయిదు కథలు ఉంటాయి, అందులో శివాత్మిక, రాహుల్ విజయ్ (Rahul Vijay) కథ ఒకటి. ఈ సినిమాలో కూడా శివాత్మిక బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంది.
ఇక ఈమధ్యనే విడుదల అయిన 'రంగ మార్తాండ' (Rangamarthanda) లో శివాత్మిక, ప్రకాష్ రాజ్ కూతురుగా నటించింది. దీనికి దర్శకుడు కృష్ణ వంశీ (Krishna Vamsi). మామూలుగా కృష్ణ వంశీ సినిమాల్లో అందరూ బాగా నటిస్తారు. శివాత్మిక కూడా ఇందులో తన నటన ద్వారా అందరినీ మెప్పించింది. అందుకే ఒక భావోద్వేగ మైన మాటలతో దర్శకుడు కృష్ణ వంశీ కి తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. కృష్ణ వంశీ దర్శకత్వం లో నటించటం తన అదృష్టం అని చెప్పుకొస్తూ అతన్ని ఎంతగానో కొనియాడింది. శివాత్మిక సాంఘీక మాధ్యమం లో చాలా చురుకుగా ఉంటూ, ఫోటోస్, తన సినిమా గురించి విశేషాలు పంచుకుంటూ ఉంటుంది.