Samantha: సిద్ధు ఫిక్స్, సమంతని ఇంకా అనుకోలేదు: నందిని రెడ్డి
ABN , First Publish Date - 2023-05-17T17:01:02+05:30 IST
ఉన్న మహిళా దర్శకురాలల్లో నందిని రెడ్డి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీస్తూ, కుటుంబం అంతా ఆహ్లాదకరంగా చూసేట్టు తీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఫీల్ గుడ్ మూవీ 'అన్ని మంచి శకునములే' తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
దర్శకురాలు నందిని రెడ్డి (NandiniReddy) ఇంకో ఫీల్ గుడ్ సినిమా 'అన్ని మంచి శకునములే' (AnniManchiSakunamule) తో ప్రేక్షకుల ముందుకు రేపు వస్తోంది. ఇందులో చాలామంది ఆర్టిస్టులు వున్నారు, అలాగే సంతోష్ శోభన్ (SantoshSobhan), మాళవిక నాయర్ (MalavikaNair) లు లీడ్ పెయిర్ గా చేస్తున్నారు. ఇందులో భావోద్వేగాలకు, కుటుంబ సంబంధాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అని చెపుతున్నారు. "ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి, చాలామంది ఆర్టిస్టులు వున్నారు. అయితే ఒక్క పాత్ర కూడా వేస్ట్ గా పోదు, పాత్రలన్నీ తీసుకునే నిర్ణయాలకు కనెక్షన్ వుంటుంది. ఈ సినిమా నేపధ్యం విక్టోరియాపురం అనే ఊరి కథ. ఆ ఊరికి ఈ పాత్రలకు ఏమిటి సంబంధం, లవ్ స్టోరీకి ఏమిటి సంబంధం, ఇలా అన్నిటితో లింక్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కథకు చాలా పాత్రలు ఉండడం వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్," అని చెప్పింది నందిని.
ఈ సినిమా కంప్లీట్ కావటానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మధ్యలో కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు పట్టింది అని, అలాగే 2019లో 'పిట్టకథలు' (Pittakathalu) అనే సినిమా ఓటిటి కి చేసాను అని చెప్పింది. లాక్‌డౌన్ టైంలో కొన్ని లొకేషన్లకు పర్మిషన్ లేదు, అలాగే అప్పుడు కునూర్ (Coonoor) లో కొన్ని రూల్స్ పెట్టారు. చాలామంది ఆర్టిస్టులు వున్నారు కాబట్టి, ఆర్టిస్టుల కాంబినేషన్ కుదరాలి. అదీ కాకుండా, యుఎస్, యూరప్ లో చేయడానికి పర్మిషన్ రాలేదు, అందుకని ఈ సినిమాకి ఇంత టైం పట్టింది అని చెప్పింది.
మౌత్ టాక్ తో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చాలా నమ్మకంగా వుంది నందిని. ఎందుకంటే తన మొదటి సినిమా 'అలా మొదలైంది' (AlaModalaindi) నుంచి 'ఓ బేబీ' (Oh!Baby) వరకు మార్నింగ్ షోకు పెద్దగా ప్రేక్షకులు రాలేదు, కానీ తర్వాతర్వాత మౌత్ టాక్ తో విపరీతంగా వచ్చి చూశారు. అందుకని ఈ సినిమా కూడా అలానే చూస్తారు అని అంటోంది. ఇలా అన్నీ కుటుంబ కథా చిత్రాలు, లేదా పెళ్లి నేపధ్యం వున్నా సినిమాలే తీసింది నందిని, కానీ తదుపరి సినిమా వీటన్నిటికీ వైవిధ్యంగా వుండబోతోందిట. "నా నెక్ట్స్ చిత్రం ఊహించని కథతో వినూత్నంగా వుంటుంది" అని చెప్పింది.
దర్శకురాలిగా ఒక్కో సినిమా తీయడానికి చాలా టైం తీసుకుంటున్నారు అన్నదానికి, "నాకు స్క్రిప్ట్ ను పూరీ (PuriJagannadh) గారిలా స్పీడ్ గా రాయడం కుదరదు. నాకు టైం పడుతుంది. ఇప్పుడే రచయితల టీమ్ ను పెట్టుకున్నాను. ఈ సినిమాకు నాకు మంచి స్లాట్ దొరికింది. నాకు పెద్దగా గ్యాప్ అనిపించలేదు. ఎందుకంటే ఆ గ్యాప్ లో కథలు రాసుకున్నా", అని చెప్పింది. మీ తదుపరి సినిమాలో సమంత వుంది అని వార్తలు వస్తున్నాయి అంటే, "హీరోగా సిద్దు (SiddhuJonnalagadda) ఫిక్స్. సమంత (Samantha) అనుకోలేదు" అని చెప్పింది.