SIIMA Awards : దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!
ABN , First Publish Date - 2023-09-17T10:58:16+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కొమురం భీమ్ పాత్రకుగానూ ఉత్తమ నటుగా సైమా అవార్డును సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 దుబాయ్‌లో ఈ నెల 15, 16 తేదీల్లో ఘనంగా జరిగింది. శుక్రవారం తెలుగు, కన్నడ పరిశ్రమలకి, శనివారం తమిళ, మలయాళ పరిశ్రమలకి పురస్కారాల్ని ప్రధానం చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో కొమురం భీమ్ పాత్రకుగానూ ఉత్తమ నటుగా సైమా అవార్డును(SIIMA) సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr). సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 దుబాయ్‌లో ఈ నెల 15, 16 తేదీల్లో ఘనంగా జరిగింది. శుక్రవారం తెలుగు, కన్నడ పరిశ్రమలకి, శనివారం తమిళ, మలయాళ పరిశ్రమలకి పురస్కారాల్ని ప్రధానం చేశారు. ‘ధమాకా’లో నటనకిగానూ శ్రీలీల ఉత్తమ నటిగా పురస్కారం అందుకొంది. ఉత్తమ చిత్రం విభాగం ‘సీతారామం’ చిత్రానికి పురస్కారం లభించింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణి, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్, ఉత్తమ డిఓపీగా సెంథిల్ కుమార్‌కు అవార్డులు దక్కాయి. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా అడివి శేష్ (మేజర్), ‘సీతారామం’లో నటనకిగానూ క్రిటిక్స్ మెచ్చిన ఉత్తమ నటిగా, ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా మృణాల్ ఠాకూర్ నిలిచారు. ‘హీరో’ సినిమాకిగానూ ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా అశోక్ గల్లా పురస్కారం అందుకున్నారు. భీమ్లానాయక్ చిత్రంలో ఉత్తమ సహాయనటుడిగా రానా దగ్గుబాటి విజేతగా నిలిచారు. శ్రుతి హాసన్ . ఫ్యాషన్ యూత్ ఐకాన్‌గా అవార్డ్ అందుకుంది. అల్లు అరవింద్, ఎన్టీఆర్, నిఖిల్, తదితరులు వేదికపై సందడి చేశారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో కొమురం భీమ్లాంటి గొప్ప పాత్రనిచ్చిన దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. అలాగే సోదరుడు, నా సహనటుడు, స్నేహితుడు చరణ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నా. నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడిన ప్రతిసారీ పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. ఈ పురస్కారం అందించిన సైమాకి థ్యాంక్స్’’ అని అన్నారు. సి. అశ్వినీదత్, హను రాఘవపూడి, డి.వి.వి. దానయ్య, ఖుష్బూ, నిఖిల్, మంచు లక్ష్మీ, చందూ మొండేటి, సుధీర్‌బాబు, బెల్లంకొండ గణేశ్, సుహాస్, సుశాంత్, సంపత్ రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తమిళం నుంచి ‘విక్రమ్’ చిత్రానికిగానూ విశ్వనాయకుడు కమల్‌హాసన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ లభించింది. కీర్తి సురేశ్, త్రిష, మాధవన్, అనిరుధ్ కూడా అవార్డులను అందుకున్నారు.
సైమా 2023 - తెలుగు విజేతలు
ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ చిత్రం: సీతారామం
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
సెన్సేషన్‌ఆఫ్ ది ఇయర్ : నిఖిల్, కార్తికేయ2
ఉత్తమ నటుడు : అడవి శేష్ (మేజర్-క్రిటిక్స్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు): బెల్లంకొండ గణేష్
కోలీవుడ్ సైమా విజేతలు..
ఉత్తమ చిత్రం : (పొన్నియిన్ సెల్వన్ - 1)
ఉత్తమ దర్శకుడు : లోకేష్ కనగరాజ్ (విక్రమ్)
ఉత్తమ నటుడు : కమల్ హాసన్ (విక్రమ్)
ఉత్తమ నటి : త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ - రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్
ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ - సాని కాయిదం
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ - విక్రమ్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ - పొన్నియిన్ సెల్వన్-1
ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల
ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1)
ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి)
ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ - రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్
ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ - లవ్ టుడే
ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ - విరుమాన్
ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి - పొన్నియిన్ సెల్వన్ - 1
ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా
ఉత్తమ సహాయ నటుడు : కాళీ వెంకట్ (గార్గి)
ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్)
ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే)