కొంతమంది దర్శకులు నన్ను వాడుకున్నారు, పాయల్ రాజపుత్ సెన్సేషనల్ కామెంట్స్

ABN , First Publish Date - 2023-07-01T12:35:48+05:30 IST

'ఆర్ఎక్స్100' సినిమాతో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన నటి పాయల్ రాజపుట్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది కానీ అందులో ఏ సినిమా కూడా ఆమెకి మంచి బ్రేక్ ఇవ్వలేకపోయింది. అందుకు ఆమె చెప్పిన కారణాలు వింటే...

కొంతమంది దర్శకులు నన్ను వాడుకున్నారు, పాయల్ రాజపుత్ సెన్సేషనల్ కామెంట్స్
Payal Rajput

దర్శకుడు అజయ్ భూపతి (AjayBhupathi) తన మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100' #RX100 తో పాయల్ రాజపుత్ (PayalRajput) అనే కథానాయకురాలిని కూడా తెలుగు తెరకి పరిచయం చేసాడు.పంజాబీ (Punjabi) సినిమాలో డెబ్యూ చేసిన ఈ పంజాబీ భామ మొదటి తెలుగు సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టింది. ఈ సినిమాతో పాయల్ అగ్ర నటీమణుల జాబితాలోకి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. ఆమెకి మంచి పేరు వచ్చింది, అలాగే అభిమానులు కూడా బాగా ఫాలో అయ్యారు. కానీ ఆ సినిమా తరువాత పాయల్ చాలా సినిమాలు చేసింది, కానీ ఎందుకో ఆమెకి ఏ సినిమా కూడా తన మొదటి సినిమాకి వచ్చినంత పేరు తెచ్చిపెట్టలేదు.

payalrajput2.jpg

దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే ఏ సినిమా అయినా, అందులో పాత్ర చిన్నది, పెద్దది అయినా తను మాత్రం 200 శాతం కృషి పెట్టి చేసానని చెప్పింది. అయితే ఆలా చేసినవన్నీ తనకు అనుకూలంగా అనుకున్నంత విజయం రాలేదని చెపుతోంది పాయల్. ఎందుకంటే కృషి చెయ్యడం వరకే తన పని అని, కానీ విజయం, అపజయం తన చేతుల్లో లేదని అంటోంది.

ఆలా అంటూనే ఇక్కడ ఒక చిన్న వివాదాస్పద వ్యాఖ్య కూడా చేసింది పాయల్. ఈ చిత్ర పరిశ్రమలో తనని కొంతమంది తప్పుదోవ పట్టించారని చెపుతోంది పాయల్. ఎందుకంటే 'ఆర్ఎక్స్ 100' #RX100 విజయం తరువాత పాయల్ ఒక్కర్తే హైదరాబాద్ లో వుంది, అందువలన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారని, తనని మిస్ గైడ్ చేసారని ఆరోపించింది. కొంతమంది దర్శకులు తప్పుదోవ పట్టించి, తనని వాడుకున్నారని సంచలన కామెంట్స్ చేసింది పాయల్. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాయల్ ఈ కామెంట్స్ చేసింది.

payalrajput1.jpg

ఇప్పుడు తాను బాగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాని, అందువల్ల ఇప్పుడు అటువంటి సమస్యలు ఉండవని చెపుతోంది.ఎటువంటి సినిమాలు చెయ్యాలో ఇప్పుడు బాగా అలోచించి సైన్ చేస్తాను అని చెప్పింది. 'వెంకీ మామ' #VenkyMama సినిమాలో వెంకటేష్ (VenkateshDaggubati) పక్కన పాయల్ చేసింది, అది కూడా తప్పుదోవ పట్టించే భాగంలో చేసిందేనా అని అడిగితే, చెప్పకుండా, 'వెంకటేష్ చాలా మంచి మనిషి, అతనితో చెయ్యడం చాలా సంతోషంగా వుంది. మళ్ళీ వచ్చినా చేస్తాను' అని చెపుతోంది. అయితే ఈ పరిశ్రమలో టాప్ లోకి వెళతాం, అలాగే కిందకి పడిపోతాం, కానీ తట్టుకొని నిలబడాలి. నెగటివిటీ ని వదిలేసి, పాజిటివ్ గా ముందుకు వెళుతున్నా అని చెప్పింది. రాబోయే సినిమా 'మంగళవారం' #Mangalavaaram మళ్ళీ అజయ్ భూపతి దర్శకత్వంలో చేస్తున్నాను అని చెప్పింది.

Updated Date - 2023-07-01T12:35:48+05:30 IST