Sound Party: సినిమాలో నో ఎమోషన్స్, నో సెంటిమెంట్స్.. 2 గంటలు నాన్‌స్టాప్‌ ఎంజాయ్ చేస్తారు

ABN , First Publish Date - 2023-11-23T12:47:22+05:30 IST

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజయ్ శేరి మీడియా మిత్రులతో ముచ్చటించారు.

Sound Party: సినిమాలో నో ఎమోషన్స్, నో సెంటిమెంట్స్.. 2 గంటలు నాన్‌స్టాప్‌ ఎంజాయ్ చేస్తారు
sound party

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ(Sound Party). వీజే స‌న్నీ (VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ (Hrithika) జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి (sanjay sheri) దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజయ్ శేరి మీడియా మిత్రులతో ముచ్చటించారు.

"మాది కామారెడ్డి అని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరగడంతో రైటింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగిందన్నారు.. పూరి జగన్నాథ్ గారిని ఇన్స్ పైర్ గా తీసుకొని.. డైరెక్టర్ అవ్వాలనుకున్నాన‌ని, మారుతి, సంపత్ నంది గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాన‌న్నారు. నాకు, మా ప్రొడ్యూసర్స్ కు కామెడీ ఎంటర్టైనర్లు ఇష్టమ‌ని ఈ కథను వారు బాగా ఎంజాయ్ చేశారన్నారు.ఇన్నోసెంట్ గా ఉండే ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ పై జరిగే కథ ఇదన్నారు.

ఈ పాత్రలకి సన్నీ, శివన్నారాయణ కరెక్ట్ గా సూట్ అయ్యారన్నారు. నా రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ నుంచే ఈ కథను రాశానని, దర్శకుడిగా నాకు ఇది తొలి సినిమా అయినా.. ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు ఉండడంతో వారంతా నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారన్నారు. హీరోయిన్ కోసం చాలామందిని ఆడిషన్స్ చేసామ‌ని హ్రితిక శ్రీనివాస్ ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయిందని మేం సెలెక్ట్ చేసిన తర్వాత తను ఆమని మేనకోడలు అని తెలిసింది అన్నారు.


శివన్నారాయణ గారిలో మంచి హ్యూమర్ ఉంటుంది. ఆయన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇది అని. అమృతం సీరియల్ లో ఆయన పాత్ర చూసి ఎలా ఎంజాయ్ చేసామో.. ఇందులో అంతకుమించి ఎంజాయ్ చేస్తారన్నారు. ఎలాంటి బూతులు లేకుండా పంచ్ డైలాగులతో.. రెండు గంటల పాటు క్లీన్ కామెడీని ఎంజాయ్ చేస్తారని తెలిపారు. క్లైమాక్స్ లో ఎమోషన్స్, సెంటిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవని, సిచువేషన్ కామెడీ ఆడియన్స్ ను ఆద్యంతం అలరిస్తుందని అన్నారు. లేనిది ఊహించుకుంటే ఎలా ఉంటుందని దాని పైనే అసలు నా కాన్సెప్ట్ వచ్చిందని, అందులో భాగంగానే బిట్ కాయిన్ ను తీసుకున్నాం అన్నారు.

జయశంకర్ నేను ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామ‌ని, నన్ను దర్శకుడిగా చేయడానికి ఆయన చేసిన సపోర్టు మరువలేనిదన్నారు. నిర్మాతలు రవి, మహేంద్రలు ఈ ప్రాజెక్టు విషయంలో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చాలా సపోర్ట్ గా నిలిచారని. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందన్నారు. ఇక హీరో శివ కార్తికేయన్ గారితో సినిమా చేయాలని నా చిర‌కాల‌ కోరిక అని, ఆయనను కలిసి కథ చెప్పడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశా కానీ నేను రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నానని తర్వాత తెలిసిందని, ఎప్పటికైనా ఆయనతో మంచి సినిమా తీస్తా అని అన్నారు.

Updated Date - 2023-11-23T12:47:54+05:30 IST