Sree leela: ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
ABN , First Publish Date - 2023-05-27T17:03:11+05:30 IST
ఈతరం హీరోయిన్స్ అంతా ఫిట్నెస్ ఫ్రీక్స్ అన్న విషయం తెలిసిందే! కథానాయికకు అందం ఎంత ముఖ్యమో.. ఫిట్నెస్ అంతకుమించి అనేలా నేటితరం నాయికలు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
ఈతరం హీరోయిన్స్ అంతా ఫిట్నెస్ ఫ్రీక్స్ (Fitness Freek) అన్న విషయం తెలిసిందే! కథానాయికకు అందం ఎంత ముఖ్యమో.. ఫిట్నెస్ అంతకుమించి అనేలా నేటితరం నాయికలు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. వారి డైలీ రొటీన్లో వర్కవుట్స్, డైట్ పక్కాగా ఉండాల్సిందే. ఫిజిక్ కోసం ఎంతగా కసరత్తులు చేస్తున్నారో.. చెబుతుంటారు. అయితే ఓ హీరోయిన్‌కు మాత్రం వర్కవుట్స్ అంటే అసలు ఇష్టం లేదట. ఆమె ఎవరో కాదు.. పెళ్లి సందDతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమై ఇప్పుడు వరుస అవకాశాలతో అగ్ర హీరోల పక్కన నటిస్తున్న శ్రీలీల(Sree leela). ఆమె సోషల్ మీడియా ఖాతాలో వర్కవుట్స్‌కు సంబంధించి ఒక్క వీడియో కూడా లేకపోవడం గమనార్హం. అయితే దీని వెనక ఓ కారణం ఉందట. తనకు వర్కవుట్స్ (No workouts) పై పెద్దగా ఆసక్తి లేదని చెబుతోందీ బ్యూటీ. మరి అంత స్లిమ్‌గా, గ్లామర్‌గా కనిపించడానికి కారణం యోగా అట.
హైదరాబాద్‌లో జరిగిన యోగా మహోత్సవ్‌లో (yoga mahotsav)శ్రీలీల పాల్గొంది. అందరితో కలిసి యోగాసనాలు వేసింది. ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరింది. ‘‘సూర్య నమస్కారం లాంటి చిన్న చిన్న ప్రక్రియలతో యోగా మొదలుపెడితే అది రొటీన్ లైఫ్‌లో భాగమవుతుంది. నాకు వర్కవుట్స్ చేయడం ఇష్టం ఉండదు. రెగ్యులర్‌గా యోగా చేస్తా. యోగాతో మన బాడీలో ఓ రకమైన ఇంజినీరింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదే నా లైఫ్ స్టయిల్. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మన ఆలోచన విధానం మెరుగుపడుతుంది. బాడీ ఫిట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బావుంటుంది’’ అని అన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది శ్రీలీల. పెళ్లిసందD సక్సెస్‌తో వరుస అవకాశాలు అందుకొంది. ‘రవితేజతో ధమాక’ పెద్ద హిట్టైంది. ఇంకా రాపో20(RAPO20), నితిన్32(Nithin 32), విడీ12(VD12), ఎన్బీకే108(NBK 108), ఉస్తాద్ భగత్‌సింగ్ (Ustaad bhagathsingh)చిత్రాల్లో నటిస్తోంది.