Joruga Husharuga: శ్రీవిష్ణు చేతుల మీదుగా ‘యువరాణి’ విడుదల

ABN , First Publish Date - 2023-09-23T17:09:44+05:30 IST

‘బేబీ’ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న హీరో.. విరాజ్ అశ్విన్. ఆయన ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. తాజాగా ఈ చిత్రం నుండి ‘యువరాణి యువరాణి’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Joruga Husharuga: శ్రీవిష్ణు చేతుల మీదుగా ‘యువరాణి’ విడుదల
Sree Vishnu and Viraj Ashwin

‘బేబీ’ (Baby) చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న హీరో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin). ఇప్పుడాయన హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రానికి ‘జోరుగా హుషారుగా’ (Joruga Husharuga) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూజిత పొన్నాడ (Poojitha Ponnada) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌, బ్రహ్మ‌జీ, చ‌మ్మ‌క్ చంద్ర‌ వంటి ఇతర పాత్రలలో నటిస్తున్నారు. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ ల‌వ్‌ మెలోడీ లిరిక‌ల్ వీడియోను హీరో శ్రీ‌విష్ణు (Sree Vishnu) చేతుల మీదుగా మేకర్స్ విడుద‌ల చేశారు.

‘ఓ క‌ల‌లా...నువ్వ‌లా.. నిజమ‌య్యావే నువ్వు బంగారు బొమ్మ యువ‌రాణి యువ‌రాణి’ అంటూ సాగిన ఈ పాట‌ను స‌ర‌స్వ‌తి పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించ‌గా, ర‌ఘు మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో విరాజ్ అశ్విన్‌, పూజిత‌ల‌పై చిత్రీక‌రించారు. ఆర్మ‌ాన్ మాలిక్‌, న‌వ్య‌స‌మీర ఈ పాట‌ను ఆల‌పించారు. ప్రణీత్ మ్యూజిక్‌ ఈ పాటకు స్వరాలను సమకూర్చారు. ఈ పాట విడుదల అనంతరం హీరో శ్రీ‌విష్ణు మాట్లాడుతూ.. ఈ సాంగ్ చూస్తుంటే.. ఈ సినిమా ఒక జెన్యూన్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అనిపిస్తుంది. సాంగ్ చాలా బాగుంది. సినిమా కూడా విజయం సాధించాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. (Joruga Husharuga Movie Yuvarani Lyrical Song)


Jorugaa-Husarugaa.jpg

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. సాంగ్ చాలా క్యాచీగా వుంది. కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌తో ఓ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం నా కెరీర్‌కు మ‌రో మంచి స‌క్సెస్‌ఫుల్ చిత్ర‌మ‌వుతుందని తెలపగా.. నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌త‌రం న‌చ్చే అంశాల‌తో అన్ని ఎమోష‌న్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం కొత్త‌ద‌నం ఆశించే అంద‌రికీ న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామని తెలిపారు. కొత్త‌ద‌నంతో నిండిన చిత్రాల‌కు విడుద‌ల విష‌యంలో నా స‌పోర్ట్ ఎల్ల‌ప్పుడూ వుంటుంద‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కుడు అను ప్ర‌సాద్‌, కెమెరామెన్ మ‌హిరెడ్డి పందుగుల త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

*Rashmika Mandanna: ‘యానిమల్’ నుంచి నేషనల్ క్రష్ లుక్కొచ్చింది

**************************************

*Vishal: న్యాయస్థానం కంటే గొప్ప వ్యక్తిగా భావించొద్దు.. విశాల్‌కు హైకోర్టు చురకలు

**************************************

Updated Date - 2023-09-23T17:09:44+05:30 IST