NTR30: అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఆమె కూతురు... వైరల్ అవుతున్న తల్లీ కూతుళ్లు

ABN , First Publish Date - 2023-03-06T17:07:10+05:30 IST

ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ పేరు అధికారికంగా ప్రకటించిన దగ్గర నుండి, జాన్వీ కపూర్ ఆమె తల్లి ఒకప్పటి అగ్ర నటి దివంగత శ్రేదేవి ఇద్దరూ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే...

NTR30: అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఆమె కూతురు... వైరల్ అవుతున్న తల్లీ కూతుళ్లు

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) #NTR30 కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. ఈరోజు జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు ఈ ప్రకటన ఇచ్చారు. ఇది ప్రకటించిన కొద్దీ సేపటి ముందే ఎన్టీఆర్ (NTR) ఆస్కార్ (Oscar Award) వేడుక‌లో పాల్గొన‌టానికి అమెరికా బ‌య‌లుదేరి వెళ్లారు. అందుకనే ఈ NTR 30పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నయ్య నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Jr-NTR2.jpg

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న NTR 30కి సంబంధించి ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సోమ‌వారం (మార్చి 6)రోజున జాన్వీ క‌పూర్ పుట్టిన‌రోజు. ఈ సందర్బంగా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మార్చి నెల‌లోనే సినిమాను లాంఛ‌నంగా ప్రాంభించి షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తారు, అలాగే ఏప్రిల్ 5 2024న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు కూడా చేస్తున్నారు.

sridevi3.jpg

అయితే కొంతమంది అభిమానులు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ పక్కన చేస్తుండటంతో, అప్పట్లో ఎన్టీఆర్ (NTR) పక్కన శ్రీదేవి (Sridevi) చాల సినిమాల్లో నటించిందని, ఇప్పుడు మనవడు అయిన ఈ ఎన్టీఆర్ తో శ్రీదేవి (Sridevi daughter) కూతురు జాన్వీ కపూర్ చేస్తుండటం చాలా బాగుంది అని అంటున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అలనాటి రాముడు పక్కన శ్రేదేవి, ఈనాటి రాముడు పక్కన ఆమె కూతురు జాన్వీ కపూర్ అని అభిమానులు ఫోటోలు పెట్టి మరీ ఆనందించటం ఆసక్తికరం. జాన్వీ కపూర్ ఇలా వేసిన ట్వీట్ లను రి-ట్వీట్ చేస్తోంది కూడా.

JanhviKapoor3.jpg

ఈ NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తారని చెపుతున్నారు. టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు (Ratnavelu), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌ (Sabu Cyril), ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ (Anirudh) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - 2023-03-06T17:07:11+05:30 IST