Adipurush: ఆనాటి లక్ష్మణుడు ఆగ్రహం..
ABN , First Publish Date - 2023-06-18T11:57:44+05:30 IST
‘ఆదిపురుష్’ )Adipurush) చిత్రం విడుదలై మూడు రోజులు పూర్తి కావొస్తున్నావిమర్శలకు అడ్డుకట్ట పడలేదు. ‘ రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ ధారావాహికలో లక్ష్మణుడిగా నటించి ప్రశంసలు అందుకున్న నటుడు సునీల్ లహ్రీ తాజాగా ‘ఆదిపురుష్’పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఆదిపురుష్’ )Adipurush) చిత్రం విడుదలై మూడు రోజులు పూర్తి కావొస్తున్నా సినిమా, అందులో కొన్ని పాత్రలు, డైలాగ్ ల విషయంలో విమర్శలకు అడ్డుకట్ట పడలేదు. ‘రామాయణం’ ఇతివృత్తంతో రూపొందిన ప్రతి సినిమా, సీరియళ్ల ఆర్టిస్ట్‌లు ‘ఆదిపురుష్’పై మండిపడుతున్నారు. పలువురు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ (Ranayan)ధారావాహికలో లక్ష్మణుడిగా నటించి ప్రశంసలు అందుకున్న నటుడు సునీల్ లహ్రీ (Sunil lahri) తాజాగా ‘ఆదిపురుష్’పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పటి నుంచీ ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా సినిమాలో ఉపయోగించిన భాషను తప్పుబడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు సినిమాలోని పలు సన్నివేశాల్లో హనుమంతుడు, రావణాసురుడి డైలాగ్స్‌ను ప్రస్తావిస్తూ విమర్శించారు. ‘రామాయణాన్ని ఆధారంగా చేసుకునే ‘ఆదిపురుష్’ తెరకెక్కిస్తున్నామని చెప్పిన వాళ్లు సినిమాలో ఇలాంటి సంభాషణలు ఉపయోగించడం సిగ్గు చేటు. శ్రీరాముడు చరిత్రను తెరకెక్కిస్తున్నామనే దృష్టి కొంచెమైనా దృష్టిలో పెట్టుకునే తీశారా?’’ అని సునీల్ లహ్రీ ప్రశ్నించారు. (Sunil Lahri Comments on Adipurush)
ఈ చిత్రం గురించి ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. హిందీలో కొన్ని సంభాషణలు మర్యాదపూర్వకంగా లేవంటూ ఇప్పటికే పలువురు నెటిజన్లు, రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం లేకుండా అలాంటి సంభాషలు ఎలా ఉపయోగించారంటూ మండిపడ్డారు. దీనిపై సినిమా మాటలు అందించిన మనోజ్ ముంతాషిర్ శుక్లా కూడా శనివారం ఓ వేదికపై స్పందించారు. ఎంతో శ్రద్థ పెట్టి డైలాగ్స్ రాసినట్లు చెప్పారు.