SV Ranga Rao: రేర్ ఫోటో వైరల్ అవుతోంది... ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది
ABN , First Publish Date - 2023-02-24T16:17:35+05:30 IST
రావణాసురిడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, ఘటోద్గచుడిగా ఒకటేమిటి ఎన్నో పౌరాణిక పాత్రలకు అతను వన్నె తెచ్చారు. అలాగే ఎన్నో సాంఘీక సినిమాలు, బాండ్ సినిమాలు ఏ సినిమా అయినా ఎస్వీఆర్ అవలీలగా చెయ్యగల దిట్ట ఎస్వీఆర్. అటువండి నటుడి అపురూపమయిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజాలంటి నటుల్లో ఎస్.వి.రంగా రావు (#SVRangaRao) ఒకరు. భారత దేశం గర్వించ దగ్గ నటుల్లో కూడా ఇతను ముందుటాడు, అంతటి నటుడు. ఏ పాత్ర అయినా అవలీలగా చెయ్యగల, జీవించగల నటుడు ఎస్వీఆర్. ఇతన్ని తెర మీద ఎంతసేపు అయినా చూడవచ్చు (#SVR) అనిపించేలా ఎటువంటి పాత్ర అయినా చేస్తాడు. 'పాతాళ భైరవి' (#PathalaBhairavi), 'మాయాబజార్' (#MayaBazar), 'నర్తనశాల' (Nartanasala), 'పాండవ వనవాసం', 'లక్ష్మి నివాసం', 'తాత మనవడు', 'పండంటి కాపురం', 'తోడికోడళ్లు', 'మిస్సమ్మ', 'సంపూర్ణ రామాయణం', ఒకటేమిటి ఎన్నో సినిమాలు ఒకదానికొకటి మించినది ఇంకొకటి. నర్తనశాల లో పోషించిన కీచక పాత్రకి జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి.
రావణాసురిడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, ఘటోద్గచుడిగా ఒకటేమిటి ఎన్నో పౌరాణిక పాత్రలకు అతను వన్నె తెచ్చారు. అలాగే ఎన్నో సాంఘీక సినిమాలు, బాండ్ సినిమాలు ఏ సినిమా అయినా ఎస్వీఆర్ అవలీలగా చెయ్యగల దిట్ట అని నిరూపించారు. అలంటి ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావు పేరు పెట్టారు. ఎస్వీఆర్ విద్యాభ్యాసం అంటే హైస్కూలు చదువు అప్పటి మద్రాసు లో జరిగింది. అక్కడ హిందూ స్కూల్ లో చదువుతున్నప్పుడు ఒక నాటకం వేశారు ఎస్వీఆర్, దాన్ని అందరూ మెచ్చుకోవటం తో అతనిలో నటుడు అవ్వాలన్న కోరిక బలపడింది. అప్పటికి ఎస్వీఆర్ వయసు 15 సంవత్సరాలు. ఎస్వీఆర్ చూసిన మొదటి సినిమా ఏంటో తెలుసా, 1934లో విడుదలైన లవకుశ (Lava Kusa).
హైస్కూల్ మద్రాసులో చదివాకా, ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశారు. డిగ్రీ అయ్యాక ఏదైనా వుద్యోగం లో చేరాలని కుటుంబం వత్తిడి చేసేవారు, కానీ ఎస్వీఆర్ కి మాత్ర నటన అంటే బాగా ఇష్టం. అందువల్ల కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి నాటకాలు వేస్తున్న రోజుల్లో అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి పెద్ద నటులతో పరిచయం ఏర్పడింది.
దర్శకుడు బి.వి.రామానందం ఎస్వీఆర్ కి దూరపు బంధువు అవటం తో అతను తీసిన 'వరూధిని' అనే చిత్రం లో ఎస్వీఆర్ కి మొదటి అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా అంతగా నడవలేదు, నిరాశ చెందిన ఎస్వీఆర్ జంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగంలో (#SVR) చేరారు. పెళ్ళికి ఇదే మంచి సమయం అని భావించి అతని మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబరు 27న వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో రంగారావు భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేదిట. అయితే తాను మంచి నటుడిని అవుతాను అనే, తనకు మంచి భవిష్యత్తు ఉందనీ, అప్పుడే ఆమెని రమ్మని చెప్పేవాడట రంగారావు. ఈ ఫోటో కూడా ఎస్వీఆర్ పెళ్లప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో ఇప్పుడు అన్ని సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. (#SVRangaRao)
అతను అనుకున్నట్టుగానే తరువాత రెండు మూడు సినిమాల్లో చిన్న వేషాలు వేసిన, నాగిరెడ్డి చక్రపాణి ల పరిచయం, విజయ సంస్థ నిర్మించిన 'షావుకారు' లో రంగారావు కు మంచి పాత్ర ఇవ్వడం, ఆ తరువాత 'పాతాళ భైరవి' లో మాంత్రికుడు వెయ్యటం, ఇంక అక్కడ నుండి తిరుగులేని నట జీవితానికి ఎస్వీఆర్ ప్రారంభించారు. తరువాత అంతా చరిత్రే.