Tamannaah: అలా జరుగుతుందని ఊహించలేదు.. ఇదెక్కడి న్యాయం!
ABN , First Publish Date - 2023-07-04T13:27:21+05:30 IST
ఇటీవల విడుదలైన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లతో ట్రెండింగ్‌లో ఉంది తమన్నా. హద్దులు దాటి శృంగార సన్నివేశాల్లో నటించిన తమన్నాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన తమన్నా పేరే వినిపిస్తోంది. దానికి తోడు బాయ్‌ఫ్రెండ్ గురించి రివీల్ చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల విడుదలైన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories2) వెబ్ సిరీస్‌లతో ట్రెండింగ్‌లో ఉంది తమన్నా(Tamannah). హద్దులు దాటి శృంగార సన్నివేశాల్లో నటించిన తమన్నాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసిన తమన్నా పేరే వినిపిస్తోంది. దానికి తోడు బాయ్‌ఫ్రెండ్ గురించి రివీల్ చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం తమన్నా ఈ సిరీస్‌లను ప్రమోట్ చేసే పనిలో ఉంది. ఈ సందర్భంలోనే తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి చెప్పుకొచ్చింది. ‘లస్ట్ స్టోరీస్2’ సెట్లోను విజయ్ తనకు తారసపడ్డాడని, ఇద్దరి మనసులు కలిశాయని చెప్పుకొచ్చింది తమన్నా.
ఆమె మాట్లాడుతూ ‘‘విజయ్ వర్మ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా భావాలను గౌరవించే వ్యక్తి అతను. అతడి జీవితాన్ని ఎంతోమంది మహిళలు ప్రభావితం చేసుంటారు. తన కుటుంబంలోని స్ర్తీలపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతాడు. ఇంట్లో వారిపై గౌరవంగా ఉండేవారు బయట మహిళలతో కూడా మర్యాదగా వ్యవహరిస్తారని నా నమ్మకం. ఇది ఇప్పటి యువత నేర్చుకోవాలి. స్ర్తీలతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారి కుమారులకు నేర్పాలి. మహిళలు ప్రతి విషయంలో రాజీపడాలనే భావనను నేను అంగీకరించను. విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే తను నా మనసుకు దగ్గరయ్యాడు’’ అని తమన్నా చెప్పింది.
తాజాగా ఆమె చేసిన వెబ్ సిరీస్‌లపై వస్తున్న వ్యతిరేకత, విమర్శల గురించి తమన్నా మాట్లాడారు. ‘‘ఈ జనరేషన్ కూడా నన్ను వ్యతిరేకిస్తారని అనుకోలేదు. హీరోలు ఎలాంటి పాత్రల్లో కనిపించినా సూపర్‌స్టార్స్ అంటూ ప్రశంసిస్తారు. కానీ, హీరోయిన్స్ నటిస్తే మాత్రం విమర్శలు కురిపిస్తారు. ఇదెక్కడి న్యాయమో నాకు అర్థం కాదు. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొన్ని నిర్ణయాలను మార్చుకోవాలి’’ అని తమన్నా అసహనంగా మాట్లాడింది.