Taraka ratna : ముద్దు పేరేంటో తెలుసా?
ABN , First Publish Date - 2023-02-19T23:50:45+05:30 IST
తారకరత్నకు (Taraka Ratna) బాబాయ్ బాలకృష్ణ (Bala krishna)అంటే ఎంతో అభిమానం. తనని ఇండస్ట్రీకి గ్రాండ్‌గా పరిచయం చేసింది ఆయనే. ఇంట్లో ఆయన్ను ఓ ముద్దు (Taraka Ratna pet name) పేరుతో పిలిచేవారు
తారకరత్నకు (Taraka Ratna) బాబాయ్ బాలకృష్ణ (Bala krishna)అంటే ఎంతో అభిమానం. తనని ఇండస్ట్రీకి గ్రాండ్‌గా పరిచయం చేసింది ఆయనే. ఇంట్లో ఆయన్ను ఓ ముద్దు (Taraka Ratna pet name) పేరుతో పిలిచేవారు. తల్లిదండ్రుల తర్వాత అలా ఎక్కువ పిలిచేది బాలయ్యే. ఇంతకీ తారకరత్న ముద్దు పేరేంటో తెలుసా... ఓబు. చిన్నప్పటి నుంచి అదే పేరుతో పిలుస్తున్నారు అని తారకరత్న ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మనం కూడా మనుషులమేజజ ఏ స్థాయిలో ఉన్నా డౌన్ టు ఎర్త్ ఉండాలని చిన్నప్పటి నుంచి కుటుంబ పెద్దల చెప్పిన దార్లోనే నడుచుకుంటున్నామని ఆయన తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. (Nandamuri balakrishna)
‘‘సినిమాల్లోకి రావడం అనేది నా కల. అది నెరవేరింది. నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు దాటింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. అలాగే సినిమాల్లో కూడా.. అవన్నీ పక్కన పెడితే నేను అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నా. హీరోగా నా మొదటి సినిమా ఓ అద్భుతం. అశ్వినీదత్, రాఘవేంద్రరావు నిర్మాణనిర్వాహణలో.. కోదండ రామిరెడ్డి దర్శకత్వం, కీరవాణి సంగీతం ఇలా అన్ని చక్కగా కుదిరాయి. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. నటుడిగా 20సినిమాలు చేసినప్పటికీ రొమాంటిక్ సీన్స్ చేయాలంటే ఇప్పటికీ భయమే. అదే పోరాట సన్నివేశాలైతే చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తా’’ అని చెబుతుండేవారు.
కొట్టాలన్నా.. పెట్టాలన్నా.. ఆయనే..
తారకరత్నకు బాలకృష్ణ అంటే ప్రాణం. కుటుంబ సభ్యుల్లో అందరిలో బాలయ్య బోళా శంకరుడని కొనియాడుతుండేవారు తారకరల్న. ఆయన గురించి బయట ఎన్నో మాట్లాకుంటారు. కానీ దగ్గరగా చూసినవారికే ఆయన గురించి తెలుస్తుంది. కొట్టాలన్నా.. తిట్టాలన్నా. పెట్టాలన్నా మా బాబాయే అని తారకరత్న చెబుతుండేవారు.