Tarun marriage: మెగా అల్లుడు కాబోతున్నాడు అనే పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ
ABN , First Publish Date - 2023-08-02T13:11:32+05:30 IST
సాంఘీక మాధ్యమంలో యువ నటుడు తరుణ్ కి పెళ్లి చేసేసారు. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా, నిహారిక కొణిదెల అంట. ఈ వార్త వైరల్ అవటంతో, పాపం తరుణ్ ఆ వార్త మీద క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే...
యువ నటుడు తరుణ్ #TarunMarriage మళ్ళీ వార్తల్లో వున్నాడు. అయితే ఎదో సినిమా చేస్తున్నాడనే, లేదా ఇంకో సినిమా గురించో కాదు, సాంఘీక మాధ్యమంలో అతనికి పెళ్లి చేసేసారు. #Tarun ఇంతకీ విషయం ఏంటంటే సాంఘీక మాధ్యమంలో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బాగా వైరల్ అయింది. #TarunMarriage ఇంతకీ పెళ్లికూతురు ఎవరనుకున్నారు, మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) కుమార్తె నిహారిక కొణిదెల (NiharikaKonidela) అని ఆ సాంఘీక మాధ్యమంలో వార్త చక్కర్లు కొట్టింది. ఇంతకీ ఈ వార్త ఎవరు మొదలెట్టారు, ఎక్కడ మొదలెట్టారో కానీ బాగా వైరల్ అయిపొయింది.
ఇంత వైరల్ అయ్యాక, ఇక చేసేదేముంది పాపం తరుణ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో చాలా సినిమాలు చేసాడు, విజయాలు సాధించాడు. ఇప్పుడు తరుణ్ సినిమాలు ఏమీ చెయ్యడం లేదు, ఎందుకంటే తనకి నచ్చిన కథ దొరకటం లేదు అని అంటున్నాడు. సినిమాలు ఏమీ చేయకున్నా, తరుణ్ ఇంతవరకు పెళ్లి చేసుకుండా బ్యాచిలర్ గా ఉంటున్నాడు కాబట్టి, ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో ఎవరితోటె జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు కూడా అదే వరుసలో తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు తరుణ్.