Telugu Film Industry : మంత్రికి శుభాకాంక్షలు... సీఎంతో భేటీ.. టైమ్ కుదిరింది
ABN , Publish Date - Dec 19 , 2023 | 04:24 PM
తెలంగాణ సినిమాటోగ్రఫీ (Cinematography Minister)మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని (komati reddy venkatreddy) తెలుగు చిత్ర పరిశ్రము చెందిన ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు (Dil raju) ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమలోని 24 శాఖలవారు మంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ (Cinematography Minister)మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని (komati reddy venkatreddy) తెలుగు చిత్ర పరిశ్రము చెందిన ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు (Dil raju) ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమలోని 24 శాఖలవారు మంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు. పరిశ్రమకు సంబంధించి పలు విషయాలు చర్చించారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మాట ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఈ నెల 21న సినిమాటోగ్రఫీ మంత్రి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సి.కల్యాణ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, సుధాకర్‌రెడ్డి, కె. రాఘవేంద్రరావు తదితరులు మంత్రిని కలిశారు. (TFI)
అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి దిల్ రాజు మినహా ఎవరూ కనీసం ఫోన్ చేసి విష్ చేయలేదని, అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మండిపడిన సంగతి తెలిసిందే! పరిశ్రమ గురించి పలు వివరాలు వారంలో నివేదిక సమర్పించాలని సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.