NenuStudentSir: సముద్రఖని ఇల్లు ఎవరి డబ్బులతో కొన్నాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-05-29T12:32:27+05:30 IST
సముద్రఖని, అవంతిక ఇద్దరూ 'నేను స్టూడెంట్ సర్' అనే సినిమాలో చేశారు. సముద్రఖని ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనపడితే, అవంతిక కథానాయకురాలిగా ఆరంగేట్రం చేస్తోంది. ఈ ఇద్దరూ ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తికర అంశాలు ఉన్నాయని దర్శకుడు రాకేష్ చెప్తున్నాడు.
'నేను స్టూడెంట్ సర్' #NenuStudentSir సినిమాలో బెల్లకొండ గణేష్ (Bellamkonda Ganesh) లీడ్ యాక్టర్ గా చేస్తున్నాడు. ఇందులో కథానాయకురాలిగా వేస్తున్న అవంతిక (Avantika) ఎవరో కాదు, ప్రముఖ నటి భాగ్యశ్రీ (Bhagyashree) కుమార్తె. ఇది ఆమెకి మొదటి సినిమా కథానాయికగా. ఈ సినిమాకి రాకేష్ ఉప్పలపాటి (RakeshUppalapati) దర్శకుడు, అతనికి కూడా ఇది మొదటి సినిమా దర్శకుడిగా. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముందుగా ఈ సినిమాలో కథానాయిక అవంతికని ఎలా తీసుకున్నారు అన్న విషయం చెప్పాడు.
"కథానాయకురాలిగా చెయ్యడానికి చాలామంది వచ్చారు, అలాగే చాలా ఆప్షన్లు కూడా వున్నాయి. కానీ భాగ్యశ్రీ గారు హిందీ 'ఛత్రపతి' (Chatrapathi) లో శ్రీనివాస్ (BellamkondaSreenivas) మదర్ గా చేశారు. వాళ్ళ అమ్మాయిని తెలుగు లో పరిచయం చేయాలనే ఆలోచన వుందని సురేష్ (BellamkondaSuresh) గారితో చెప్పారు, అప్పుడు ఆమెని ఈ సినిమా ద్వారా పరిచయం చేద్దామని ఆలా అవంతికని చూశాం. ఈ పాత్రకు ఆమె సరిపొతుందనిపించింది, దానికితోడు భాగ్యశ్రీ అమ్మాయి కావడంతో సినిమాకి కూడా హెల్ప్ అయ్యింది," అని చెప్పాడు దర్శకుడు.
అలాగే ఇందులో సముద్రఖని (Samuthirakani) పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. అతను ఈ సినిమా ఒప్పుకోవటం మీద కూడా ఒక ఆసక్తికర సంఘటన చెప్పాడు దర్శకుడు రాకేష్. మొదటి ఈ పోలీస్ పాత్రకు దర్శకుడు గౌతమ్ మీనన్ (GautamMenon) ని అనుకున్నారట. ఐతే నిర్మాత సతీష్ ఈ పాత్రకి సముద్రఖని పేరుని సూచించాడు. కానీ ఫైనల్ చాయిస్ మాత్రం దర్శకుడికే వదిలేశారు. దర్శకుడికి సముద్రఖని ఈ పాత్రకు అన్ని విధాలా సూట్ అవుతారు అనిపించి అతన్ని అప్రోచ్ అయ్యాడు. సముద్రఖని మీడియం రేంజ్ సినిమాలు పెద్దగా చేయరు, కానీ ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే సముద్రఖని తీసిన తెలుగు సినిమా 'శంభో శివ శంభో' #ShamboSivaShambo సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. అప్పుడు సురేష్ ఇచ్చిన రెమ్యునిరేషన్ తోనే సముద్రఖని ఇల్లు కొనుక్కున్నారని, ఇప్పటికే అదే ఇంట్లో వుంటున్నారని తెలిసింది. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళిన సురేష్ గారే గుర్తుకు వస్తుంటారు, వాళ్ళ అబ్బాయి సినిమా ఖచ్చితంగా చేయాలని ఆయన ఈ సినిమా చేశారు, అని చెప్పాడు దర్శకుడు.