Baby: హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు వెనక కథ ఇదే !
ABN , First Publish Date - 2023-07-15T16:39:32+05:30 IST
అమ్మాయికైనా, అబ్బాయికైనా, దర్శకుడుకి అయినా ఒక్క హిట్ సినిమాలు చాలు పేరు రావటానికి, అదే అమ్మాయి, అబ్బాయి అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. ఆలా పాత బస్తీ నుండి వచ్చిన వైష్ణవి చైతన్య అనే తెలుగు అమ్మాయి 'బేబీ' అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఇంతకీ ఆమె పేరు వెనక ఒక కథ వుంది, అది ఏంటో తెలుసా..
'బేబీ' #Baby సినిమాలో హీరోయిన్ గా వేసిన వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) పదహారణాల తెలుగు అమ్మాయే. ముందు ఏవో చిన్న చిన్న సినిమాలో చేసింది, అందులోనే 'అల వైకుంఠపురం లో' #AlaVaikuntapuramlo అల్లు అర్జున్ #AlluArjun చెల్లెలు గా చేసింది. మీకు ఆ సన్నివేశం గుర్తుంది కదా ! నవదీప్ (Navadeep) బైక్ మీద వచ్చి ఈమె చున్నీ లాక్కొని పోతాడు, #BabyTheMovie అప్పుడు ఆమె అన్నయ్య ఏంటిరా నీ చెల్లెల్ని ఆలా చేస్తే వూరుకుంటావా అని అడుగుతుంది కదా, ఆ తరువాత ఇంకో రెండు మూడు సినిమాలు చేసింది ఈమె.
ఇప్పుడు 'బేబీ' #BabyTheMovie సినిమాలో కథానాయకురాలిగా చేసింది. ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), విరాజ్ అశ్విన్ (VirajAswini) లు ఇందులో కథానాయకులు. సాయి రాజేష్ (SaiRajesh) దర్శకుడు. ఈమె సినిమాకి ఒక పిల్లర్, ఆమె ఇందులో చాలా సహజంగా నటించి అందరినీ మెప్పించింది. అయితే ఏంటి వైష్ణవి చైతన్య అని పేరు అనగానే తమిళం లో నాన్న పేరు కుమార్తెకి పెడుతూ వుంటారు కదా, ఆలా అనుకొని తమిళం అమ్మాయి, ఇక్కడ పుట్టి పెరిగిందేమో అని అందరికీ సందేహం వస్తుంది కదా. అదే విషయం ఆమెని అడిగితే...
"నేను తెలుగు అమ్మాయినే సార్, పాత బస్తీ నాది, చాంద్రాయణ గుట్ట" అంది 'బేబీ' కథానాయకురాలు వైష్ణవి చైతన్య. మరి పేరు ఏంటి వైష్ణవి చైతన్య, చివరి పేరు మీ ఫాదర్ పేరా? అని అడిగితే.. కాదండీ అది జన్మ నక్షత్రం బట్టి ముందు అక్షరం 'సి' రావాలని ఆలా పెట్టారు నాకు. కానీ నాకు చైతన్య పేరు అంతగా నచ్చలేదు, వైష్ణవి అన్న పేరు బాగా నచ్చింది, అందుకని వైష్ణవి చైతన్య అని మార్చుకున్నాను అని చెప్పింది వైష్ణవి తన పేరు గురించి. #BabyMovie
మరి ఈమె ఎంతవరకు చదువుకుందో తెలుసా అంటే... "నేను ఇంటర్ మీడియట్ వరకు చదివాను. డిగ్రీ చదవలేదు," అని చెప్పింది. అప్పటినుండి యూట్యూబ్ లో వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా చేసుకుంటూ ఈరోజు పాత బస్తీ నుండి 'బేబీ' సినిమాలో హీరోయిన్ గా చేసి ఒక పెద్ద సెలబ్రిటీ గా ఎదిగింది. ఇప్పుడు ఈ తెలుగు అమ్మాయి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సాయి పల్లవి (SaiPallavi) లాంటి నటీమణులతో ఈమెని పోలుస్తున్నారు.