MalliPelli: ఈ సినిమాని చూడమని చెప్పాల్సిన పనిలేదు, అందరూ థియేటర్ కి వచ్చేస్తారు: జయసుధ
ABN , First Publish Date - 2023-05-22T11:47:54+05:30 IST
సీనియర్ నటి జయసుధ 'మళ్ళీ పెళ్లి' ప్రీ రిలీజ్ వేడుకలో సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాకి ఎవరినీ రమ్మని చెప్పనవసరం లేదని, ఎందుకంటే పక్కింట్లో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తితో అందరూ థియేటర్ కి వచ్చేస్తారని చెప్పారు జయసుధ.
నరేష్ #VKNaresh, పవిత్ర లోకేష్ #PavitraLokesh ల సినిమా 'మళ్ళీ పెళ్లి' #MalliPelli ప్రీ రిలీజ్ వేడుకలో జయసుధ (Jayasudha) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జయసుధ, నరేష్ కలిపి ఒకేసారి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. వీళ్ళిద్దరూ 'పండంటి కాపురం' #PandantiKapuram సినిమాతో ఆరంగేట్రం చేశారు. "మా ఇద్దరినీ 'పండంటి కాపురం' సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, మా ఆంటీ విజయనిర్మల (Vijayanirmala). ఇప్పుడు ఇద్దరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 50 ఏళ్ళు అంటే అది మామూలు విషయం కాదు," అని చెప్పారు జయసుధ. #PavitraNaresh అప్పుడు ఇద్దరినీ ఇంట్రడ్యూస్ చేసినా, నేను, నరేష్ ఎవరికివారు మంచి పాత్రల ద్వారా ప్రేక్షకులని అలరించారని చెప్పారు.
నరేష్ ఎంత అద్భుత నటుడో అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు జయసుధ. ఇద్దరం విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ తో పరిచయం అయ్యాం, మళ్ళీ 50 ఏళ్ల తరువాత అదే బ్యానర్ లో మేమిద్దరం కలిసి నటించడం ఆనదంగా వుంది అని చెప్పారు జయసుధ. ఈ సందర్భంగా జయసుధ పాత విషయాలని పంచుకున్నారు. "నేను నా స్వంత బ్యానర్ మీద నరేష్ తో 'అదృష్టం' అనే సినిమా తీసాను. అది అప్పట్లో ప్రేక్షకులకి అర్థం కాలేదు, కానీ అది ఇప్పుడు తీయాల్సిన సినిమా. ఇప్పుడు ప్రేక్షకులకి అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తీయాల్సిన సినిమా అప్పుడు తీసేసాం. చాలా మంచి మూవీ అది," అని చెప్పారు.
జయసుధ, దర్శకుడు ఎం ఎస్ రాజుని (MSRaju) బాగా ప్రైస్ చేశారు. 'వాన' (Vaana) అనే సినిమాలో ఎంఎస్ రాజు దర్శకత్వం లో నటించాను అని, అందులో నరేష్, తను భార్యాభర్తలుగా నటించడం జరిగింది అని చెప్పారు. అయితే ముందు మేమిద్దరం భార్యాభర్తలు ఏంటి అని అడిగితే, ఇది నటన అని చెప్పారు ఎం ఎస్ రాజు, అంతే కదా ఇద్దరం మంచి నటులం అందుకని కొంచెం ఇబ్బడిగా వున్నా నటించాము అని చెప్పారు జయసుధ.
మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడుతూ ఇది ఒక సెన్సేషనల్ మూవీ అని చెప్పారు జయసుధ. ఎందుకంటే మామూలుగా అందరికీ పక్కింట్లో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి, ఈ 'మళ్ళీ పెళ్లి' సినిమాకి వస్తారు. మనింట్లో ఏమి జరుగుతున్న పట్టించుకోరు, అది మానవ సహజం అని, అందుకని ఈ సినిమా చూడమని చెప్పాల్సిన పని లేదని, ఆటోమేటిక్ గా అందరూ ఆరోజు థియేటర్ కి వచ్చేస్తారని జయసుధ చెప్పారు. పవిత్రలోకేష్ #PavitraLokesh తో తాను కన్నడలో ఒక సినిమాలో నటించానని చెప్పారు జయసుధ.