Reddy Brothers: హాలీవుడ్ సినిమా చేసిన ఈ నిర్మాతలు, ఇప్పుడు తెలుగు టాలెంట్ పరిచయం చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-07-25T13:27:21+05:30 IST

హాలీవుడ్ లో 'జురాసిక్ పార్క్' సినిమాకి పని చేసిన సినిమాటోగ్రాఫర్ తో పని చేసిన ఈ నిర్మాతలు అక్కడ ఒక సినిమా తీసి, తరువాత ఇండియాకి వచ్చేసి ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ, కొత్త దర్శకులను, నటీనటులను, సాంకేతిక నిపుణలను పరిశ్రమకి పరిచయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరంటే...

Reddy Brothers: హాలీవుడ్ సినిమా చేసిన ఈ నిర్మాతలు, ఇప్పుడు తెలుగు టాలెంట్ పరిచయం చేస్తున్నారు
Appi Reddy and his brother Venkat Annapareddy

కథానాయకురాలు కానీయండి, విలన్స్ కానీయండి తెలుగు దర్శకులు ఇప్పుడు ఎక్కువగా పరభాషా నటుల మీదే ఆధారపడుతున్నారు. మలయాళం, కన్నడ, హిందీ నటీమణులు ఎక్కువగా కనపడుతున్న తెలుగు సినిమాలలో ఈమధ్య కొంతమంది చిన్న నిర్మాతలు తెలుగు వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఇస్తూ తెలుగు అమ్మాయిలను, తెలుగు నటీనటుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారిలో నిర్మాత అప్పిరెడ్డి, అతని బ్రదర్ అన్నపరెడ్డి వెంకట్. అప్పిరెడ్డి సినిమాలు చూసుకుంటే, అతని బ్రదర్ వ్యాపారాలు చూసుకుంటారు.

slumgdoghusband1.jpg

ఇంతకు ముందు 'ప్రెషర్ కుక్కర్' (PressureCooker), అలాగే 'జార్జిరెడ్డి' (GeorgeReddy) సినిమాలు నిర్మించింది ఈ నిర్మాతలే. అందులో 'జార్జిరెడ్డి' సినిమా ఎంతలా విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రెండు సినిమాలతో లోకల్ టాలెంట్ కి అవకాశం ఇచ్చిన అప్పిరెడ్డి (AppiReddy) ఇప్పుడు 'స్లమ్ డాగ్ హస్బెండ్' #SlumDogHusband అనే సినిమాతో మరికొంతమందిని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ (ARSridhar), ఇంతకు ముందు పూరీ జగన్నాథ్ (PuriJagannadh) దగ్గర పని చేసాడు. ఇతనికి మొదటి సినిమా ఇది దర్శకుడిగా. సంజయ్ రావు (SanjayRao), ప్రణవి మానుకొండ (PranaviManukonda) ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ (Brahmaji) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 29న విడుదల చేస్తున్నారు.

georgereddy.jpg

తన నేపధ్యం గురించి మాట్లాడుతూ నిర్మాత అప్పిరెడ్డి కి సినిమా అంటే ఆసక్తి చిన్నప్పటి నుంచే వుంది. సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన అప్పిరెడ్డికి ఆ వాళ్ళ వూర్లో ఒక సినిమా థియేటర్ ఉండేది. అందుకని ఎప్పుడూ సినిమాలని చూస్తూ అలా సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నాడు అని చెప్తున్నారు. చదువు అయిపోయిన తరువాత వ్యాపారరిత్యా విదేశాలకు వెళ్లి అక్కడ ఓ హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించారు అప్పిరెడ్డి, అన్నపరెడ్డి. ఆ సినిమా 2016లో నిర్మించారని చెప్తున్నారు, ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ఆ చిత్రానికి జురాసిక్ పార్క్ #JurrasicPark డీఓపీ పని చేశారు. ఆ సినిమా తరువాత 2017 లో వీళ్లిద్దరూ ఇండియాకి వచ్చేసారు అని చెప్పారు.

slumgdoghusband2.jpg

ఈ 'స్లమ్ డాగ్ హజ్బెండ్' #SlumDogHusband సినిమా గురించి మాట్లాడుతూ ఇది పూర్తి వినోదాత్మక చిత్రం అని చెప్తున్నారు. ఈ సినిమాలో అంతర్లీనంగా ఓ సందేశాన్ని కూడా ఇస్తున్నాం. మూఢనమ్మకాల మీద ఈ సినిమా ఒక సెటైర్‌లా ఉంటుంది. దర్శకుడు శ్రీధర్ ఈ కథతో వచ్చినప్పుడు ఇది చాలా కొత్తగా అనిపించింది, అందుకని వెంటనే వొప్పుకున్నాం. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపూ బాగా నవ్వుతూనే ఉంటాడు, ఆలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పారు నిర్మాతలు.

ఈ సినిమాలో తెలుగు అమ్మాయి ప్రణవి మానుకొండ (PranaviManukonda) కథానాయకురాలిగా చేసింది. "మొదటి నుండీ తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా పెట్టాలని డిసైడ్ అయ్యాం, అందుకని ఇద్దరు ముగ్గురిని ఆడిషన్స్ చేసాక చివరికి ప్రణవిని తీసుకున్నాం" అని చెప్పారు అప్పిరెడ్డి. అలాగే 'జార్జి రెడ్డి' #GoergeReddy కథ విన్నప్పుడు విన్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది, ఒక రెబల్ లాంటి స్టోరీ చెప్పాలని ఆ సినిమా చేశాం అని చెప్పారు అప్పిరెడ్డి. "మా సంస్థను దీర్ఘదృష్టితో ప్రారంభించాం. మంచి సినిమాలు తీయాలని పెట్టాం. మా సంస్థలో ఇంకో ఆరు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కొత్త దర్శకులతోనే సినిమాలు తీస్తున్నాం, అలాగే కొత్తవాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించాం. చిన్న సినిమాలతో పాటు కొన్ని కథలు పెద్ద హీరోలకు కూడా చెప్పించాలని చూస్తున్నాం," అని చెప్పారు.

slumgdoghusband-producers.jpg

మామూలుగా అయితే ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉంటుంది, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ (PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటించిన 'బ్రో' #Bro సినిమా శుక్రవారం విడుదలవుతోంది. అందుకని మేం శనివారం విడుదల చెయ్యాలని అనుకున్నాం. మా సినిమా మొదటి నుండి చివరి వరకూ నవ్వుకునేలా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి సంగీతం ఒక హైలైట్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఓ రెండు గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది అని మాత్రం గట్టిగా చెప్పగలని అని చెప్పారు నిర్మాత.

ఇందులో బ్రహ్మాజీ (Brahmaji) కుమారుడు సంజయ్ రావు (SanjayRao) కథానాయకుడిగా చేసాడు. అసలు ఈ కథని బ్రహ్మాజీ ఎంతో నమ్మారు, అందుకనే అతను ఈ సినిమాను ముందుండి బాగా ప్రమోట్ చేస్తున్నారు. చెప్పాలంటే అతను ఈ సినిమాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు అని అన్నారు అప్పిరెడ్డి. అలాగే మా 'స్లమ్ డాగ్ హజ్బెండ్' ప్రీ రిలీజ్ వేడుకని జూలై 27 గురువారం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు టాప్ లో వున్న కథానాయిక శ్రీలీల (Sreeleela), అలాగే టాప్ దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా వస్తున్నారు.

slumgdoghusband3.jpg

అప్పిరెడ్డి ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెడతాను అని చెప్తున్నారు, అలాగే అతని బ్రదర్ (వెంకట్ అన్నపరెడ్డి) వ్యాపారం మీద ఫోకస్ పెడతారు అని చెప్తున్నారు. కథ అంతా ఓకే అయిన తరువాత మా బ్రదర్‌కు చెబుతాను. మేం ఇంత వరకు ఏ దర్శకుడు, ఏ హీరో దగ్గరకు వెళ్లి కథ చెప్పలేదు. మా దగ్గరికే చాలా కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఇంకో రెండు చిత్రాలు విడుదల చేయబోతోన్నాం, అని చెప్పారు అప్పిరెడ్డి.

తదుపరి 'మిస్ట‌ర్ ప్రెగ్నెంట్' #Mr Pregnant అనే ఇంకో కాన్సెప్ట్ సినిమా విడుదలకి రెడీ గా వుంది, అలాగే ఇంకొక అయిదారు సినిమాలు రెడీ గా వున్నాయి. ఈ సినిమాలతో మరికొంతమంది టాలెంటెడ్ నటీనటుల్ని, సాంకేతిక నిపుణలను పరిచయం చేస్తున్నారు. ఇదే కాదు, అప్పిరెడ్డికి సాఫ్ట్ వెర్ సంస్థ కూడా వుంది. అందులో సుమారు 500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు, అంటే అటు కొన్ని వందలమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ, ఇటు సినిమాల ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నవాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు ఈ రెడ్డి బ్రదర్స్.

Updated Date - 2023-07-25T13:27:21+05:30 IST