Upasana Konidela: ఆ ఆనందాన్ని మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు!
ABN , First Publish Date - 2023-06-16T17:47:24+05:30 IST
రామ్‌చరణ్- ఉపాసనల వివాహం జరిగి ఈ నెల 14వ తేదికి 11 వసంతాలు పూర్తయింది. ఈ ఏడాది వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మేరకు చరణ్, ఉపాసన ఓ నిర్ణయం తీసుకున్నారు.
రామ్‌చరణ్(Ram Charan) - ఉపాసన9Upasana)ల వివాహం జరిగి ఈ నెల 14వ తేదికి 11 వసంతాలు (11th Anniversary) పూర్తయింది. ఈ ఏడాది వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మేరకు చరణ్, ఉపాసన ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా చిరంజీవి ఇంటికి సమీపంలోనే మరో ఇంట్లో ఉంటున్న ఈ జంట త్వరలో చిరంజీవి ఇంటికి చేరుకోనున్నారు. ఈ మేరకు ఉపాసన ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘త్వరలో అత్తమామల దగ్గరకు షిఫ్ట్ అవుతున్నాం. పుట్టబోయే బిడ్డ సంరక్షణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆమె చెప్పారు.
‘‘మామూలుగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ, మేము దానికి పూర్తి భిన్నం. ప్రస్తుతం చరణ్ నేనూ.. అత్తమామలతో (Chiranjeevi-Surekha)కాకుండా విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే, మా ఎదుగుదలలో గ్రాండ్ పేరంట్స్ కీలక పాత్ర పోషించారు. వాళ్ల నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గ్రాండ్ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు’’ అని ఉపాసన చెప్పుకొచ్చారు.
ప్రెగ్నెన్సీ గురించి చరణ్‌కు చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ చెప్పారు ఉపాసన. ‘‘ప్రెగ్నెంట్ అయ్యాననుకుంటా అంటూ సందేహంగా మొదటిసారి చరణ్‌కు చెప్పాను. అది నిజమని తెలిశాక ఆయన ఎంతో సంతోషించారు. తన స్టైల్‌లో సెలబేట్ చేశారు’’ అని ఉపాసన అన్నారు.