Upcoming Movies : వినోదాల విందు.. ఈ వారం సందడి ఈ చిత్రాలదే!
ABN , First Publish Date - 2023-10-16T13:37:42+05:30 IST
వినోదాల విందు వడ్డించేందుకు దసరా పండగ సిద్ధమైపోయింది. పండగ సందర్భంగా థియేటర్స్‌లో సందడి చేయడానికి వివిధ రకాల జానర్ల చిత్రాలు రెడీగా ఉన్నాయి. తెలుగులో పలు చిత్రాలు పండగ సీజన్ కోసం క్యూ కట్టాయి. అలాగే ఓటీటీలోనూ సందడి చేయడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.
వినోదాల విందు వడ్డించేందుకు దసరా పండగ సిద్ధమైపోయింది. పండగ సందర్భంగా థియేటర్స్‌లో సందడి చేయడానికి వివిధ రకాల జానర్ల చిత్రాలు రెడీగా ఉన్నాయి. తెలుగులో పలు చిత్రాలు పండగ సీజన్ కోసం క్యూ కట్టాయి. అలాగే ఓటీటీలోనూ సందడి చేయడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం విడుదల కానున్న చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం..
‘నేల కొండ భగవంత్ కేసరి.. ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది’ అంటు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భగవంత కేసరి’. కాజల్ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు మాస్‌మహారాజా రవితేజ. అయితే సరైన విజయం చూసి చాలా కాలం అయింది. తాజాగా వంశీ దర్శకత్వంలో బయోగ్రాఫికల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ స్టువర్టుపురం దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రచార చిత్రాలు చూస్తుంటే పక్కా మాస్ మసాలా చిత్రం లాగా అనిపిస్తోంది. దసరా కానుకగా అక్టోబరు 20న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది.
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లియో’. త్రిష కథానాయిక. సంజయ్ దత్, అర్జున్ తదితరులు కీలక పాత్రధారులు. దసరా కానుకగా ఈ నెల 19న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘మన కోసం ఓ వీరుడు వచ్చే వరకు యుద్థం మొదలు పెట్టొద్దు’ అని అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఆ వీరుడు ఎవరు? ప్రజల కోసం ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడనేది తెలియాలంటే ‘గణపథ్: ఎ హీరో ఈజ్ బోర్న్’ సినిమా చూడాల్సిందే. టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా ఈ చిత్రంలో నటించారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. వికాస్ బహల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 20న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
అలాగే ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు - సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
అక్టోబరు 17 : ఐ వోకప్ ఎ వ్యాంపైర్ (వెబ్‌సిరీస్)
అక్టోబరు 17 : ది డెవిల్ ఆన్ ట్రైయల్ (హాలీవుడ్)
అక్టోబరు 17 : కాలాపానీ (వెబ్‌సిరీస్)
అక్టోబరు 18 : సింగపెన్నే (తమిళ చిత్రం)
అక్టోబరు 19 : బాడీస్
అక్టోబరు 19 : నియో (వెబ్‌సిరీస్)
అక్టోబరు 20 : డూనా (కొరియన్ సిరీస్)
అక్టోబరు 20 : కందసామీస్: ద బేబీ (ఇంగ్లీష్ మూవీ)
ఓల్డ్ డాడ్స్ (హాలీవుడ్) అక్టోబరు 20
అమెజాన్ ప్రైమ్
అక్టోబరు 18: పర్మినెంట్ రూమ్మేట్స్
అక్టోబరు 20 : మామా మశ్చీంద్ర
అక్టోబరు 20 : ది అదర్ జోయ్
అక్టోబరు 20 : ట్రాన్స్‌ఫార్మర్స్
బుక్ మై షో
అక్టోబరు 15 : టాక్ టూ మీ (హాలీవుడ్)
అక్టోబరు 17 : షార్ట్ కమింగ్స్ (హాలీవుడ్)
అక్టోబరు 19 : నన్2 (హాలీవుడ్)
అక్టోబరు 20 : మై లవ్ పప్పీ
ఆహా
అక్టోబరు 20 : సర్వం శక్తిమయం (వెబ్‌సిరీస్)
అక్టోబరు 20: రెడ్ శాండల్ వుడ్ (తమిళ చిత్రం)