Varun Tej: పాపం వరుణ్ తేజ్... దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో ఘోస్ట్ ఇచ్చాడుగా...

ABN , First Publish Date - 2023-08-28T13:48:58+05:30 IST

వరుణ్ తేజ్ కి మరోసారి నిరాశ ఎదురైంది. ఇంతకు ముందు 'ఘని' అనే ఒక డిజాస్టర్ సినిమాతో ఈ 'గాండీవధారి అర్జున' అనే సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం వరుణ్ కి మరో 'ది ఘోస్ట్' ఇచ్చాడు అని అంటున్నారు.

Varun Tej: పాపం వరుణ్ తేజ్... దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో ఘోస్ట్ ఇచ్చాడుగా...
Varun Tej and Praveen Sattaru

గతవారం మూడు సినిమాలు విడుదలయ్యాయి అందులో దర్శకుడు ప్రవీణ్ సత్తారు (PraveenSattaru), వరుణ్ తేజ్ (VarunTej) కాంబినేషన్ లో వచ్చిన 'గాండీవధారి అర్జున' #GandeevadhariArjuna కూడా వుంది. అలాగే కార్తీక్ గుమ్మకొండ (KartikeyaGummakonda), నేహా శెట్టి (NehaShetty) జంటగా నటించిన 'బెదురులంక 2012' #Bedurulanka2012 విడుదలైంది, వీటితో పాటు మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ (DulquerSalman) నటించిన 'కింగ్ అఫ్ కొత్త' #KingOfKothaకూడా విడుదలైంది. ఇంకా మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి.

ఇందులో చెప్పుకోవలసిన సినిమాగా వరుణ్ తేజ్ సినిమా వుంది. ఎందుకంటే విడుదలకి ముందు ఈ సినిమా చాలా స్టైలిష్ యాక్షన్ సినిమాగా, అలాగే వరుణ్ తేజ్ కి ఒక మంచి బ్రేక్ కావాలి, అది ఈ సినిమాతో తీరుతుంది అని అన్నారు ఈ సినిమా విడుదలకి ముందు ప్రచార చిత్రాల్లో. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా ఇంతకు ముందు నాగార్జున తో 'ది ఘోస్ట్' #TheGhost అనే ఒక డిజాస్టర్ సినిమా తీసి, అది నాగార్జున కెరీర్ లో వరస్ట్ సినిమా గా చేయగలిగాడు.

varuntej2.jpg

మరి ప్రవీణ్ 'ది ఘోస్ట్' తరువాత చేసిన సినిమా ఈ 'గాండీవధారి అర్జున'. ఇందులో సాక్షి వైద్య (SakshiVaidya) కథానాయకురాలిగా వరుణ్ తేజ్ పక్కన నటించింది. ఇక ఈ సినిమా కూడా 'ది ఘోస్ట్' సినిమాలనే ఇంకో పెద్ద డిజాస్టర్ అయింది. వీకెండ్ కలెక్షన్స్ చూస్తే 'బెదురులంక 2012' సినిమా పరవాలేదు అనిపించింది, అలాగే ఈ 'గాండీవధారి అర్జున' అయితే టోటల్ డిజాస్టర్ అయింది. మొదటి రోజు మొదటి షో నుండే ఈ సినిమాకి చాలా నెగటివ్ టాక్ వచ్చింది. పాపం వరుణ్ తేజ్ కి దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో 'ఘోస్ట్' ఇచ్చాడు అని ప్రేక్షకులు అంటున్నారు అంటే ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో ఊహించుకోవచ్చు.

వీటన్నిటికీ తోడు ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఇంతకు ముందు సూర్య (Suriya) నటించిన 'సింగం 3' #Singam3 లో వచ్చిన పాయింటే. అదేంతో ఈ చిత్ర యూనిట్ లో ఒక్కరికి కూడా ఆ ఆలోచన ఎందుకు రాలేదో మరి. విదేశాలు తమ చెత్తని భారతదేశానికి ఎలా తరలిస్తున్నాయో, దానివల్ల ఎంతమంది భారతీయ ప్రజలు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు, వింత రోగాల బారిన చాలామంది ఎలా పడుతున్నారు అన్న నేపథ్యంలో తీసిన కథ. ఆ 'సింగం 3' సినిమా కథ, ఈ సినిమా కథ ఒక్కటే, కొంచెం నేరేషన్ లో తేడా. మరి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ (BVSNPrasad) కానీ, దర్శకుడు కానీ, కథానాయకుడు ఇంత చిత్ర యూనిట్ సభ్యులకి కానీ ఎవరికీ ఎందుకు ఆలోచన రాలేదు, ఈ కథ గురించి పట్టించుకోలేదో అర్థం కాలేదు అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా తెర మీద చాలా స్లోగా, బోరింగ్ గా దర్శకుడు నేరేట్ చేసాడు. సినిమా ఎక్కడా ఆసక్తికరంగా ఉండదు అని ప్రేక్షకులు అంటున్నారు. వరుణ్ తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా మీద దృష్టి పెట్టి ఆ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి.

అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ అఫ్ కొత్త' కూడా బాక్స్ ఆఫీస్ ముందు నిలబడలేకపోయింది. ఆ సినిమా నేరేషన్ చాలా స్లోగా ఉండటమే అందుకు కారణం. అది కూడా ఒక అవుట్ డేటెడ్ కథని తీసుకొని ఎదో చెప్పాలనుకొని, ఇంకేదో తెర మీద చూపించినట్టుగా కనపడుతోంది అని అన్నారు ప్రేక్షకులు ఆ సినిమా చూసి.

ఇవి కూడా చదవండి:

Gandeevadhari Arjun film review: సినిమా కథ చెత్త, చతికిలబడిన అర్జునుడు

Bedurulanka 2012 film review: యుగాంతం ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే...

Updated Date - 2023-08-28T13:48:58+05:30 IST