RanaNaidu: దానివల్ల వెంకీ మామకి ఏమయిందో తెలిస్తే షాక్ అవుతారు
ABN , First Publish Date - 2023-04-03T12:36:18+05:30 IST
విక్టరీ వెంకటేష్ గా ప్రేక్షకులకు బాగా తెలిసిన వెంకీ 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తో కొత్త మలుపులు తిప్పాడు. ఆ వెబ్ సిరీస్ చూసిన హిందీ నిర్మాతలు వెంకటేష్ నటనకి, అతని ఫాలోయింగ్ ని చూసి ఏమి చేశారో తెలిస్తే షాక్ అవుతారు.
వెంకటేష్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన 'రానా నాయుడు' (Rana Naidu) వెబ్ సిరీస్ బాగోలేదు అంటూనే ప్రపంచం అంతటా చూసేసారు. ఒక్క భారత దేశంలోనే కాదు, ఆ వెబ్ సిరీస్ మొత్తం ప్రపంచం లోనే ఎక్కువ చూసిన వెబ్ సిరీస్ లలో నాలుగో స్థానం లో వుంది అని తెలిసింది. అయితే ఇది నెట్ ఫ్లిక్స్ ఓ.టి.టి. లోంచి తీసేసారు అని అన్నారు కానీ, తరువాత మళ్ళీ పెట్టేసారు అని కూడా తెలిసింది. ఎందుకంటే ఇది ఇంకా నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్నట్టుగా చాలామంది చెపుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ వెబ్ సిరీస్ లో చేసిన వెంకటేష్ కి ఇది మంచి పేరు తీసుకురాలేదు అని పరిశ్రమలో అనుకుంటున్నారు కదా. అయితే దీనివల్ల వెంకటేష్ కి ఎంత మేలు జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. "ఈ వెబ్ సిరీస్ చూసాక, వెంకటేష్ కి నాలుగు హిందీ సినిమా ఆఫర్స్ వచ్చాయంటే మీరు నమ్ముతారా. కానీ అది నిజం, చాల ఆఫర్స్ హిందీ నుండి వచ్చాయి," అని వెంకటేష్ కి దగ్గరగా వున్న అతని కుటుంబం లోని వ్యక్తి చెప్పాడు.
చాలామంది ఈ వెబ్ సిరీస్ వెంకటేష్ కి బాగా నెగటివ్ అని అనుకున్నారు కానీ నిజం చెప్పాలంటే అతనికి చాలా మంచే జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా తెలుగు ప్రజలకే కాకుండా మిగతా ప్రాంతాల్లో వున్నవారికి కూడా వెంకీ మామ అంటే ఎలా ఉంటాడు, ఎలా పెర్ఫార్మ్ చేస్తాడు అని ఈ వెబ్ సిరీస్ చూసాక తెలిసింది. తెలుగు వాళ్ళకి అంటే వెంకటేష్ బాగా పరిచయం వున్న నటుడు, కానీ మిగతా ప్రాంతాలవారికి వెంకీ చేసిన హిందీ సినిమాల గురించి తెలుసు కానీ, అతనికి ఇంత ఫాలోయింగ్ వుంది అన్న సంగతి తెలీదు కదా. అందువల్ల తెలుగు ప్రేక్షకులు కొంచెం బాడ్ ఫీల్ అయ్యారేమో కానీ, హిందీ నిర్మాతలు, ప్రేక్షకులు కొత్తగా వుంది అని తెగ చూస్తున్నారట ఈ వెబ్ సిరీస్. అందువలనే నాలుగు సినిమాలు ఆఫర్ వచ్చిందంటే వాళ్ళకి ఎంత నచ్చిందో చూడండి మరి.
వెంకీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తూ, ప్రొడ్యూసర్ చేస్తూ వున్న సినిమా 'కిసి క భాయ్ కిసి క జాన్' (Kisi Ka Bhai Kisi Ka Jaan) లో ఒక మంచి పాత్రలో కనిపించనున్నాడు. మరి ఇప్పుడు ఆఫర్స్ వచ్చిన హిందీ సినిమాల్లో చేస్తాడో, లేదా తెలుగు కె పరిమితం అవుతాడో చూడాలి.