Vijay Deverakonda: అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చేసి చూపించాడు, అదీ విజయ్ అంటే!

ABN , First Publish Date - 2023-09-14T13:46:31+05:30 IST

విజయ్ దేవరకొండ ముందు ఒక చిన్న సినిమాతో విజయం అందుకొని ఈరోజు భారతదేశం అంతటా తన గురించి మాట్లాడే విధంగా ఒక పెద్ద నటుడిగా ఎదిగాడు. ఈమధ్యనే 'ఖుషి' విజయోత్సవ సభలో అతను ఒక నిర్ణయం ప్రకటించాడు, అది ఇప్పుడు అమలు చేసాడు.

Vijay Deverakonda: అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చేసి చూపించాడు, అదీ విజయ్ అంటే!
Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (VijayDeverakonda) తాను ఏమి చెప్తాడో అదే చేస్తాడు. సినిమాల విషయంలోనే కాదు, తాను మొదలుపెట్టిన సమాజ సేవలో కూడా అంతే. కొన్ని సంవత్సరాల క్రితం కోవిద్ వచ్చిన దగ్గర నుండీ ప్రజలను ఆదుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు మొదలు పెట్టిన సామజిక సేవ కొనసాగిస్తూనే వున్నాడు. కొన్ని రోజుల క్రితం తన సినిమా 'ఖుషీ' #Khushi విజయోత్సవ సభలో ఒక వంద కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి ఆడుకుంటాను అని చెప్పాడు.

vijaydeverakonda2.jpg

'ఖుషి' సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని, ఇందుకు 100 కుటుంబాలను ఎంపికచేసి వారికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందిస్తామని విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమా వైజాగ్ విజయోత్సవ సభలో ప్రకటించాడు. ఆ రోజు ఆ వేదిక మీద చెప్పినట్లే, ఈరోజు 100 మంది లక్కీ కుటుంబాలను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేసాడు విజయ్. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కుటుంబాలు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు లోని ప్రాంతాల నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేయడం విశేషం. త్వరలోనే వీరికి హైదరాబాద్ లో జరిగే 'ఖుషి' సినిమా గ్రాండ్ ఈవెంట్ లో చెక్స్ పంపిణీ చేయబోతున్నారు.

ఇదే విషయం మీద విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ, "ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్ ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా" అంటూ పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ, సమంత (Samantha) జంటగా నటించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ (MythriMovieMakers) నిర్మించారు. దీనికి దర్శకుడు శివ నిర్వాణ (ShivaNirvana).

Updated Date - 2023-09-14T13:46:31+05:30 IST