Khushi: హమ్మయ్య, విజయ్ దేవరకొండ సినిమా విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2023-03-23T16:11:50+05:30 IST

ఎన్నాళ్ళో నుండో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్న 'ఖుషీ' ఎట్టకేలకు షూటింగ్ మళ్ళీ మొదలెట్టింది. సమంత, విజయ దేవరకొండ ఈ సినిమాలో లీడ్ పెయిర్, శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడంటే...

Khushi: హమ్మయ్య, విజయ్ దేవరకొండ సినిమా విడుదల తేదీ ఖరారు

సెన్సేషనల్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ (Khushi). మంచి లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ (Shiva Nirvana) దీనికి దర్శకుడు. ఈ సినిమా ఈమధ్య చాలా కాలం ఆగిపోయింది. ఎందుకంటే సమంత ఒక రకమైన వింత వ్యాధితో బాధపడుతూ ఉండటం వలన, అది తగ్గటానికి చాలా కాయలం పట్టింది. అందుకని ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయినా కూడా ఆగిపోయి, మళ్ళీ ఈమధ్యనే మొదలయింది.

మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు ఒక విడుదల తేదీ ప్రకటించారు అధికారికంగా. సెప్టెంబర్ 1 (Release date is September 1) న విడుదల అవుతుందని చెప్పారు. 'నిన్ను కోరి', 'మజిలీ' (Majili) వంటి అందమైన ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి 'ఖుషి' పేరుతో వస్తున్న ఈ సినిమాతో వస్తున్నారు. సమంత తో ఇంతకు ముందు 'మజిలీ' కి పని చేసాడు శివ నిర్వాణ, అలాగే విజయ్, సమంత కలిసి 'మహానటి' (Mahanati) లో నటించారు. ఇప్పుడు మళ్ళీ 'ఖుషీ'తో ఇలాంటి టాలెంట్ వున్నా వీరందరూ కలవటం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేతించింది.

vijaydeverakonda-samantha.jpg

సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. కాశ్మీర్ తో పాటు ఎన్నో అందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంతో మరోసారి విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ ని చూస్తారు ప్రేక్షకులు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా పేరు కూడా 'ఖుషీ' అదే పేరుని ఈ సినిమాకి కూడా పెట్టడం ఆసక్తికరం. 'ఖుషీ' సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ గా నిలించింది.

Updated Date - 2023-03-23T16:11:51+05:30 IST