Vijay varma: తమన్నాను చూడగానే అర్థమైంది
ABN , First Publish Date - 2023-08-28T20:58:15+05:30 IST
తమన్నాతో (Tamannah) ప్రేమలో ఉన్నట్లు నటుడు విజయ్ వర్మ ప్రకటించినప్పటి నుంచీ వీరిద్దరూ మోస్ట్ ట్రెండింగ్ పెయిర్‌గా నిలిచింది. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌వర్మ(Vijay varma) తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘
తమన్నాతో (Tamannah) ప్రేమలో ఉన్నట్లు నటుడు విజయ్ వర్మ ప్రకటించినప్పటి నుంచీ వీరిద్దరూ మోస్ట్ ట్రెండింగ్ పెయిర్‌గా నిలిచింది. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌వర్మ(Vijay varma) తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘నేను ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఎవరినీ ప్రేమించకూడదని నియమం పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఆ సమయంలో ఇండస్ర్టీ అంటే చాలా కోపం ఉండేది. కానీ, తమన్నాను కలిశాక నా ఆలోచన మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ నేను పెట్టుకున్న డేటింగ్ రూల్ బ్రేక్ చేశాను. ఆర్ట్, బిజినెస్, ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన ఉన్నవాళ్లు, సృజనాత్మకత ఉన్న వాళ్లు మన జీవితంలోకి వేస్త ఎంత విలువ ఉంటుందో.. తమన్నాను చూడగానే అర్థమైంది. దీంతో అప్పటి వరకూ ఉన్న నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తను ఏ విషయాన్నైనా చాలా లోతుగా ఆలోచిస్తుంది. తన అనుభవం, పనితీరు, అన్నింటికంటే ముఖ్యంగా తన మంచితనం.. ఇవ్వన్నీ నాకు ఎంతో ఉపయోగపడతాయి. చాలా విషయంలో తమన్నా నా దృష్టి కోణాన్ని మార్చేస్తుంది’’ అంటూ మిల్కీబ్యూటీపె గురించి చెప్పుకొచ్చారు.
‘లస్ట్ స్టోరీస్-2’ షూటింగ్లో విజయ్ వర్మ, తమన్నాల మధ్య ప్రేమ చిగురించింది. ఈ స్టోరీస్ ప్రమోషన్స్‌లో వీరిద్దరూ తమ రిలేషన్ గురించి బయటపెట్టింది. ‘నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వర్మ వచ్చాడు’ అంటూ విజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.