Vishal Frank video: మొహం దాచుకున్నది అందుకే.. ఫ్రాంక్‌ వీడియోపై క్లారిటీ

ABN , Publish Date - Dec 28 , 2023 | 05:11 PM

ఇటీవల తమిళ హీరో విశాల్‌కు సంబంది?ంచిన ఓ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ వీదుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ కనిపించే ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వినిపించాయి. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటే కొందరు విశాల్‌పై విమర్శల వర్షం కురిపించారు.

Vishal Frank video: మొహం దాచుకున్నది అందుకే.. ఫ్రాంక్‌ వీడియోపై క్లారిటీ

ఇటీవల తమిళ హీరో విశాల్‌(Vishal)కు సంబంధించి  ఓ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ వీదుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ కనిపించే ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వినిపించాయి. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటే కొందరు విశాల్‌పై విమర్శల వర్షం కురిపించారు. దీనిపై తాజాగా విశాల్‌ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. 

‘‘దయచేసి నన్ను అందరూ క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పే సమయం వచ్చింది. అందులో కొంచెం వాస్తవం.. కొంచెం ఫ్రాంక్‌ ఉంది. లొకేషన్‌ ప్రకారం అది న్యూయార్క్‌లో తీసిందే. నేను, మా కజిన్స్‌ తరచుగా అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటాం. నా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏడాదంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి న్యూయార్క్‌కు వెళ్తాం. ఆ వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ఫ్రాంక్‌. క్రిస్మస్‌ రోజు నాతో సరదాగా మా కజిన్స్‌ అందరూ ఫ్రాంక్‌ వీడియో చేశారు. నన్ను ఆటపట్టించడం కోసం చేశారంతే. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీసి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అదే జరిగింది. ఆ వీడియోపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నా. కొంతమంది ఆ వీడియో వీక్షించి నన్ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదు’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్‌ ‘రత్నం’లో నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. 


Updated Date - Dec 28 , 2023 | 05:11 PM