Virupaksha: సాయి ధరమ్ తేజ్ సింపతీ వర్క్ అవుట్ అవుతుందా?
ABN , First Publish Date - 2023-04-17T14:25:23+05:30 IST
నటీనటుల వ్యక్తిగత సమస్యలు తమ సినిమా విడుదలకి ముందు ప్రచారంలో భాగంగా చెప్పడం వలన ప్రేక్షకులను థియేటర్ కి తమ సినిమాలని చూడటానికి రప్పించగలరా...
తెలుగు సినిమా నటీనటులు చాలామంది తమ సినిమాకి సంబదించిన ప్రశ్న తప్ప వేరే వ్యక్తిగత ప్రశ్న ఏది అడిగినా చెప్పకుండా దాటేస్తూ వుంటారు, అది ఎందుకు ఇప్పుడు అంటారు. కానీ ఈమధ్య చాలామంది నటీనటులు తమ జీవితంలో వ్యక్తిగతంగా జరిగిన సంఘటనలను సినిమా ప్రచారంలో మాట్లాడి ఆ సింపతీ తో సినిమాకి ప్రేక్షకులను రప్పించగలమని అనుకుంటున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. #VirupakshaFromApril21
ఉదాహరణకు సమంత (Samantha)నే తీసుకోండి. సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ డబ్బింగ్ చెప్పాను అనే ఫోటో ఒకటి, లేదా తన వ్యాధికి సంబంధించి కొన్ని సంఘటనలు తన సినిమాకి సంబదించిన ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడింది. కానీ ఈ సింపతీ అనేది ఒక సినిమాకి పనికొస్తుందేమో కానీ, అన్ని సినిమాలకి వర్తించకపోవచ్చు అని పరిశ్రమలో అంటున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏదైనా ప్రశ్న అడిగితే సమాదానం ఇవ్వడానికి దాటేసినప్పుడు, ఇలాంటి వ్యక్తిగత సమస్యలని ఎందుకు ప్రేక్షకులకి సినిమా విడుదల ముందు చెప్పటం.
'యశోద' (Yashoda) సినిమాకి, అలాగే 'శాకుంతలం' (Shaakuntalam) సినిమా ముందు సమంత వ్యక్తిగత సమస్యే పెద్దగా హైలైట్ అయింది. మొదటి సినిమాకి సింపతీ వర్క్ అవుట్ అయిందేమో అనిపిస్తుంది. రెండో సినిమాకి వర్క్ అవుట్ కాలేదేమో మరి. సినిమా చూసేటప్పుడు ఎలా నటిస్తున్నారు అని ప్రేక్షకుడు చూస్తాడా, లేక తెరమీద ఆ పాత్ర వేసిన నాటే/నటుడు ని ఒక రోగి లా చూస్తారా ప్రేక్షకులు. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు, సినిమాలో మీ పాత్ర కన్నా అక్కడ మీ వ్యక్తిగత సమస్య హైలైట్ అయింది కాబట్టి.
ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా 'విరూపాక్ష' (Virupaksha) సినిమా ప్రచారాలు అన్నిటిలోనీ తనకి జరిగిన ప్రమాదం గురించే మాట్లాడుతున్నాడు. ప్రమాదం జరిగింది రెండు సంవత్సరాల క్రితం, అయిపొయింది అది ఎప్పుడో, దాన్నించి తేరుకొని సినిమా కూడా చేస్తున్నాడు కదా, సినిమా గురించి మాట్లాడితే మంచిది అని చాలామంది అంటున్నారు. #VirupakshaFromApril21ఎందుకంటే ప్రతి నటికి,నటుడికి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కానీ సినిమా ప్రచారాల ముందు వాటిని ప్రేక్షకులకు చెప్పడం అంటే, సింపతీ కోసమే కదా. ఈ సింపతే ఎంతవరకు పని చేస్తుంది అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇందులో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయకురాలు.
అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఇద్దరినీ తప్పు పట్టడానికి కాదు, ఇద్దరూ ధైర్యవంతులు కాబట్టే తమకి వున్న వ్యక్తిగత సమస్యలను తట్టుకొని మళ్ళీ స్ట్రాంగ్ గా వచ్చారు. అది హర్షించవలసిందే, కానీ వాటిని #VirupakshaFromApril21 సినిమా ప్రచారాలకు ఎంతవరకు ఉపయోగపడతాయి, ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించగలవా. ఒకవేళ అదే అయితే వీళ్ళకి సాంఘీక మాధ్యమాల్లో లక్షలకు లక్షలు ఫాలోవర్లు వున్నారు కదా, వాళ్లలో పది శాతం మంది సినిమా చూసినా అది హిట్ కదా! మరి ఆలా ఎందుకు అవటం లేదు.
ఇవి కూడా చదవండి:
Akhil Akkineni: చాలా మెచూరిటీ తో మాట్లాడిన అఖిల్
ShaakuntalamCollections: మరీ ఇంత దారుణమా... మొదటి రోజు షాకింగ్ కలెక్షన్