Writer Padmabhushan: సంచలన నిర్ణయం... మహిళలకు పూర్తిగా..
ABN , First Publish Date - 2023-02-07T17:05:34+05:30 IST
సుహాస్ (suhas)నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan)గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే! పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. చక్కని వసూళ్లు రాబడుతోంది.
సుహాస్ (suhas)నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan)గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే! పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. చక్కని వసూళ్లు రాబడుతోంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోమవారం మహేశ్ (Maheshbabu) వీక్షించి సినిమా ఎంతో నచ్చిందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. మంగళవారం ఈ సినిమా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు(Intresting announcement). కేవలం మహిళల కోసమే రెండు తెలుగు రాష్ట్రాల్లో 39 షోలు (39 ladies shows) ప్రదర్శించాలని టీమ్ ప్లాన్ చేసింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే మహిళలంతా (free for Ladies) ఉచితంగా సినిమా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబందించిన టికెట్ ను యాంకర్ సుమ విడుదల చేసారు.
నిర్మాతలు మాట్లాడుతూ
దాదాపు 39 థియేటర్స్ లో నాలుగు షోలను మహిళాలకు ఉచితంగా ప్రదర్శించనున్నాం. 39 థియేటర్స్ లో నాలుగు షోలు కలిపి దాదాపు 70 వేల మంది ప్రేక్షకులు సినిమా చూసే కెపాసిటీ వుంది. 70 వేల ఫ్యామిలీస్ తో రేపు మీటింగ్ జరగబోతుంది. దిని కోసం కోటి రూపాయిలు పెడుతున్నాం. ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులు చూడాలనేది మా ఉద్దేశం. గీత ఆర్ట్స్ వారికి ఈ ఆలోచన చెప్పగానే ఎంతోగానో సపోర్ట్ చేశారు. పాసులు ప్రింట్ చేసిన ఎంపిక చేసిన థియేటర్స్ పంపించాం. మహిళలకు కౌంటర్ వద్ద ఉచిత పాసులు ఇస్తారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి వస్తే .. భార్య ఉచితంగా సినిమా చూస్తారు, భర్త టికెట్ కొనుక్కుంటారు. ఇదే మా స్వీట్ సర్ప్రైజ్ ఫర్ విమన్. దయచేసి బుధవారం మహిళలు అందరూ వచ్చి సినిమా చూసి ఓ గొప్ప స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాను. మహిళలు తప్పకుండా చూడాల్సిన సినిమా రైటర్ పద్మభూషణ్’’ అన్నారు.
ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.