Guntur Kaaram: ‘గుంటూరు కారం’లోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Dec 29 , 2023 | 02:00 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’. టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతోన్న ఈ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో మహేష్, శ్రీలీలల మాస్ స్టెప్స్ అదరహో అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.